عَن ابنِ عباسٍ رضي الله عنهما أنَّ رسولَ اللهِ صلي الله عليه وسلم قال:
«لَو يُعطَى النّاسُ بدَعواهُم لادَّعَى رِجالٌ أموالَ قَومٍ ودِماءَهُم، لَكِنَّ البَيِّنَةَ على المُدَّعِى، واليَمينَ على مَن أنكَرَ».
[حسن] - [رواه البيهقي، وغيره هكذا، وبعضه في الصحيحين] - [الأربعون النووية: 33]
المزيــد ...
అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"ప్రజలకు కేవలం వారి దావాల ఆధారంగానే ఇవ్వబడితే, కొంతమంది ప్రజలు ఇతరుల సంపదపై మరియు రక్తంపై (ప్రాణాలపై) కూడా దావా చేస్తారు. కానీ, సాక్ష్యం చూపే బాధ్యత దావా చేసేవారి మీద ఉంటుంది; మరియు ప్రమాణం నిరాకరించే వ్యక్తిపై ఉంటుంది."
[ప్రామాణికమైనది] - [رواه البيهقي وغيره هكذا وبعضه في الصحيحين] - [الأربعون النووية - 33]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: సాక్ష్యాలు గానీ లేదా తగిన ఆధారాలు గానీ లేకుండా ప్రజలు దావా చేసిన (క్లెయిమ్ చేసిన) దానిని ఇచ్చివేస్తే, కొంతమంది ఇతరుల డబ్బు మరియు రక్తాన్ని కూడా క్లెయిమ్ చేస్తారు. అయితే, దావా చేస్తున్న వ్యక్తి, తాను దావా చేస్తున్న దానికి సాక్ష్యం మరియు రుజువును తప్పనిసరిగా సమకూర్చాలి. అతని వద్ద సాక్ష్యం, రుజువు లేకపోతే, ఆ దావా ప్రతివాదికి సమర్పించబడుతుంది. అతను దానిని తిరస్కరించినట్లయితే, అతను ప్రమాణం చేయాలి, ఆ విధంగా అతడు నిర్దోషిగా ప్రకటించబడతాడు.