+ -

عَنْ أُسَامَةَ بْنِ زَيْدٍ رضي الله عنه قَالَ: قِيلَ لَهُ: أَلَا تَدْخُلُ عَلَى عُثْمَانَ فَتُكَلِّمَهُ؟ فَقَالَ: أَتَرَوْنَ أَنِّي لَا أُكَلِّمُهُ إِلَّا أُسْمِعُكُمْ؟ وَاللهِ لَقَدْ كَلَّمْتُهُ فِيمَا بَيْنِي وَبَيْنَهُ، مَا دُونَ أَنْ أَفْتَتِحَ أَمْرًا لَا أُحِبُّ أَنْ أَكُونَ أَوَّلَ مَنْ فَتَحَهُ، وَلَا أَقُولُ لِأَحَدٍ يَكُونُ عَلَيَّ أَمِيرًا: إِنَّهُ خَيْرُ النَّاسِ بَعْدَمَا سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«يُؤْتَى بِالرَّجُلِ يَوْمَ الْقِيَامَةِ، فَيُلْقَى فِي النَّارِ، فَتَنْدَلِقُ أَقْتَابُ بَطْنِهِ، فَيَدُورُ بِهَا كَمَا يَدُورُ الْحِمَارُ بِالرَّحَى، فَيَجْتَمِعُ إِلَيْهِ أَهْلُ النَّارِ، فَيَقُولُونَ: يَا فُلَانُ مَا لَكَ؟ أَلَمْ تَكُنْ تَأْمُرُ بِالْمَعْرُوفِ، وَتَنْهَى عَنِ الْمُنْكَرِ؟ فَيَقُولُ: بَلَى، قَدْ كُنْتُ آمُرُ بِالْمَعْرُوفِ وَلَا آتِيهِ، وَأَنْهَى عَنِ الْمُنْكَرِ وَآتِيهِ».

[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 2989]
المزيــد ...

ఉసామహ్ ఇబ్న్ జైద్ రదియల్లాహు అన్హు తో ఇలా అనడం జరిగింది: “నీవు ఉథ్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్ రదియల్లాహు అన్హు వద్దకు వెళ్ళి (దీని గురించి) ఎందుకు మాట్లాడవు?” దానికి ఆయన ఇలా అన్నారు: “ఆయనతో మాట్లాడలేదని అనుకుంటున్నావా? ఆయనతో మాట్లాడకుండానే నేను నీకు వినిపిస్తున్నానా? అల్లాహ్ సాక్షిగా! నేను ఆయనతో మా మధ్య ఉన్న విషయాలను గురించి మాట్లాడినాను. నేను ఏ విషయాలలోనైతే చొరవ తీసుకుని మొదలు పెట్టాలో, మొదలుపెట్టడానికి ముందే వాటిని బయట పెట్టడం నాకు ఇష్టం లేదు. మరియు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అంటూ ఉండగా విన్న తరువాత, నాపై పాలకునిగా ఉన్న వ్యక్తితో “ప్రజలలో నీవు అత్యంత ఉత్తముడవు” అని నేను అనను:
“ ఒక వ్యక్తి ని ప్రళయదినం రోజున తీసుకురావడం జరుగుతుంది, ఆ పై అతన్ని నరకం లో విసిరివేయడం జరుగుతుంది, అతని పొట్ట నుండి ప్రేగులు బయటికి పడి గాడిద తన తిరగలి చుట్టూ తిరిగినట్లు అతను వాటిచుట్టూ తిరుగుతూ ఉంటాడు. నరకవాసులు అక్కడ ప్రోగు అయి వారు'ఓ ఫలా నీకు ఏమి జరిగినది ?నీవు మాకు మంచి ని భోదించేవాడవు చెడు నుండి ఆపేవాడవు కదా? అని అడుగుతారు దానికి అతను సమాధానం ఇస్తూ ‘అవును నిజమే, నేను మంచిని భోదించేవానిని కానీ దాన్నిఆచరించేవాడిని కాదు అలాగే చెడు ను ఖండించే వాడిని కానీ స్వయంగా దాన్ని నేనే ఆచరించేవాడిని 'అని తెలియపరుస్తాడు".

[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 2989]

వివరణ

ఉసామా బిన్ జైద్‌తో (రదియల్లాహు అన్హుమ్) తో ఇలా అనడం జరిగింది: “నీవు ఉథ్మాన్ బిన్ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు) వద్దకు వెళ్లి, ప్రజల మధ్య తలెత్తిన వివాదం గురించి అతనితో ఎందుకు మాట్లాడకూడదు మరియు దానిని పూర్తిగా చల్లార్చడానికి ఎందుకు ప్రయత్నం చేయకూడదు? దానికి ఆయన వారికి ఇలా తెలియజేసినారు: విభేదాలు మరింతగా పెచ్చరిల్లకుండా ఉండాలని, జాతిప్రజల (ఉమ్మత్) యొక్క విశాల ప్రయోజనాన్ని ఆశిస్తూ తాను ఆయనతో రహస్యంగా మాట్లాడినానని, తన ఉద్దేశ్యం పాలకుడిని బహిరంగంగా ఖండించడం, లేదా నిందించడం కాదని, ఎందుకంటే, నేను అలా బహిరంగంగా ఖండించడం ఖలీఫా మీద దాడికి ఒక కారణం కావచ్చు; అది ఉపద్రవాన్ని, కీడును తీసుకుని వచ్చే ఒక చెడు ద్వారము, దానిని తెరవడానికి నేను మొదటి వాడిని కారాదు.
తరువాత ఉసామహ్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: తాను అమీర్’ను (పాలకుడిని) ఒంటరిగా కలిసి (పరిస్థితులపై) తగిన సలహా ఇచ్చినానని, అతడు అమీర్ అయినా సరే తాను అతడిని పొగడనని, పాలకుల సమ్ముఖాన తప్పుడు ముఖస్తుతి చేయనని, ఇలా ఎందుకు అంటే, తాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనగా తాను విని ఉండడమే అని అన్నారు: “పునరుత్థాన దినమున ఒక వ్యక్తి తీసుకు రాబడతాడు మరియు అగ్నిలో విసిరివేయబడతాడు; వేడి తీవ్రత మరియు నరక శిక్ష యొక్క తీవ్రత కారణంగా అతని ప్రేగులు అతని కడుపు నుండి వెంటనే బయటకు వస్తాయి. ఈ స్థితిలో అతడు తన పేగులతో గానుగ చుట్టూ తిరుగుతూ ఉండే గాడిదలా నరకంలో తిరుగుతూ ఉంటాడు. నరక జనులు అతని చుట్టూ ఒక వృత్తాకారంలో గుమిగూడి, అతనిని చుట్టుముట్టి, “ఓ ఫలానా, నీవు మంచి చేయమని ఆఙ్ఞాపిస్తూ ఉండేవాడివి మరియు చెడును నిషేధిస్తూ ఉండేవాడివి కదా?” అని అడుగుతారు.
దానికి అతడు: “అవును నిజమే, నేను మంచి చేయమని ఆదేశిస్తూ ఉండేవాడిని, కానీ నేనేఆచరించేవాడిని కాదు, చెడును నిషేధిస్తూ ఉండేవాడిని, కానీ నేనే ఆ పనులకు పాల్బడుతూ ఉండే వాడిని” అంటాడు.”

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ పష్టో అస్సామీ السويدية الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية الصربية الرومانية Малагашӣ Канада
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. అధికారంలో ఉన్నవారికి సలహా ఇచ్చే విషయంలో ప్రాథమిక సూత్రం ఏమిటంటే, ఆ విషయం అధికారంలో ఉన్న వ్యక్తికి మరియు సలహా ఇచ్చే వ్యక్తికి మధ్యనే ఉండాలి, మరియు ఆ వ్యక్తి దాని గురించి సాధారణ ప్రజలలో మాట్లాడరాదు.
  2. ఈ హదీథులో చెప్పే మాటలకు మరియు చేసే ఆచరణలకు పొంతన లేని వారికి (ఆ రెంటి మధ్య వైరుధ్యం ఉన్న వారికి) పునరుత్థాన దినమున తీవ్రమైన ముప్పు ఉంటుంది అనే హెచ్చరిక ఉన్నది.
  3. పాలకుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి. వారిని గౌరవించాలి. మంచి పనులు చేయమని వారిని ఆదేశించాలి. చెడు పనులు చేయకుండా వారిని నిరోధించాలి.
  4. పాలకుల ముఖస్తుతి చేయరాదు, దానికి విరుద్ధంగా - అతనికి వ్యతిరేకంగా పైకి కనబడకుండా జరుగుతున్న విషయాలను అతనికి తెలియజేయాలి, అబద్ధపు ముఖస్తుతి చేయువాని వలే కాకుండా.
ఇంకా