عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه:
أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَرَأَ فِي رَكْعَتَيِ الْفَجْرِ: {قُلْ يَا أَيُّهَا الْكَافِرُونَ}، وَ{قُلْ هُوَ اللهُ أَحَدٌ}.
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 726]
المزيــد ...
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం :
“ఫజ్ర్ యొక్క రెండు రకాతుల (సున్నతు) నమాజులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, (మొదటి రకాతులో) “ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్” సూరహ్’ను, (రెండవ రకాతులో) “ఖుల్ హువల్లాహు అహద్” సూరహ్’ను పఠించేవారు.”
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 726]
ఫజ్ర్ యొక్క రెండు రకాతుల రవాతిబ్ (స్వచ్ఛంద – సున్నత్) నమాజులో, మొదటి రకాతులో సూరహ్ అల్ ఫాతిహా పఠించిన తరువాత “ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్” సూరహ్’ను (సూరహ్ అల్-కాఫిరూన్), మరియు రెండవ రకాతులో సూరహ్ అల్ ఫాతిహా పఠించిన తరువాత “ఖుల్ హువల్లాహు అహద్” సూరహ్’ (సూరహ్ అల్-ఇఖ్లాస్) పఠించుటను ఎక్కువగా ఇష్టపడేవారు.