عَنْ عَبْدِ اللَّهِ بنِ مَسْعُودٍ رضي الله عنه أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«سِبَابُ المُسْلِمِ فُسُوقٌ، وَقِتَالُهُ كُفْرٌ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 48]
المزيــد ...
అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త్ర సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ఒక ముస్లింను తిట్టుట, దూషించుట, శాపనార్థాలు పెట్టుట అవిధేయత అవుతుంది; మరియు అతనితో కొట్లాటకు దిగుట, యుద్ధానికి దిగుట అవిశ్వాసము.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 48]
ఒక ముస్లిం తన ముస్లిం సోదరుడిని శపించడం, అవమానించడం, దూషించడం నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం నిషేధించారు; ఇది ఒక విధమైన అనైతికత, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లంకు అవిధేయత చూపుట అవుతుంది; మరియు ఒక ముస్లిం తన ముస్లిం సోదరుడితో పోరాడటం ఒక అవిశ్వాస చర్య, అయితే అది “కుఫ్ర్ అస్గర్’ అవుతుంది (తక్కువస్థాయి కుఫ్ర్ – చిన్నపాటి అవిశ్వాసము).