عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه عَنْ رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«إِذَا لَقِيَ أَحَدُكُمْ أَخَاهُ فَلْيُسَلِّمْ عَلَيْهِ، فَإِنْ حَالَتْ بَيْنَهُمَا شَجَرَةٌ أَوْ جِدَارٌ أَوْ حَجَرٌ ثُمَّ لَقِيَهُ فَلْيُسَلِّمْ عَلَيْهِ أَيْضًا».
[صحيح] - [رواه أبو داود] - [سنن أبي داود: 5200]
المزيــد ...
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు,
“మీలో ఎవరైనా ధార్మిక (ఇస్లాం పరంగా) సోదరుడైన మరొక విశ్వాసిని కలిసినపుడు అతనికి ‘సలాం’ చేయాలి (అభివాదము చేయాలి). ఒకవేళ వారి మధ్య ఒక చెట్టు, లేదా ఒక గోడ లేక ఒక పెద్ద శిల వచ్చినట్లైతే (దానిని దాటిన తరువాత) మరల అతణ్ణి కలిసినపుడు కూడా అతనికి సలాం చేయాలి (సలాం చేసి ఒకటి, రెండు నిమిషాలే అయినప్పటికీ).
[దృఢమైనది] - [దాన్ని అబూ దావుద్ ఉల్లేఖించారు] - [سنن أبي داود - 5200]
ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముస్లింలు తమ ముస్లిం సోదరులను కలుసుకున్నప్పుడల్లా ఒకరికొకరు అభివాదం చేయాలని (సలాం చేయాలని) ప్రోత్సహించడం చూడవచ్చు. వారు కలిసి నడుస్తున్నప్పుడు, వారి మధ్య చెట్టు, గోడ లేదా పెద్ద రాయి వంటి అడ్డంకి వచ్చి దానికి అటువైపునుండి ఒకరు, ఇటువైపునుండి ఒకరు నడుస్తూ, తరువాత వారు మళ్ళీ కలుసుకున్నప్పుడు, వారు మళ్ళీ ఒకరికొకరు సలాం చేయాలి – సలాం చేసి ఒకటి, రెండు నిమిశాలే అవుతున్నప్పటికీ.