عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«لَتَتَّبِعُنَّ سَنَنَ الَّذِينَ مِنْ قَبْلِكُمْ، شِبْرًا بِشِبْرٍ، وَذِرَاعًا بِذِرَاعٍ، حَتَّى لَوْ دَخَلُوا فِي جُحْرِ ضَبٍّ لَاتَّبَعْتُمُوهُمْ» قُلْنَا: يَا رَسُولَ اللهِ آلْيَهُودَ وَالنَّصَارَى؟ قَالَ: «فَمَنْ؟».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 2669]
المزيــد ...
అబూ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“మీరు నిశ్చయంగా మీకంటే పూర్వం గతించిన వారి విధానాలను అంగుళం అంగుళం, మూరలు మూరలుగా అనుసరిస్తారు (అంచెలంచెలుగా అనుసరిస్తారు) – ఎంతగా అంటే, ఒకవేళ వారు ఏదైనా ఉడుము రంధ్రములోనికి దూరితే, అందులోనూ మీరు వారిని అనుసరిస్తారు”; మేము “ఓ రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! (మాకంటే పూర్వం గతించిన వారంటే ఎవరు?) యూదులూ మరియు క్రైస్తవులా?” అని ప్రశ్నించాము. దానికి ఆయన “మరి వారు కాక ఇంకెవరు?” అన్నారు.
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 2669]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన మరణానంతరం తన జాతిలోని (ఉమ్మత్ లోని) కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందో చెబుతున్నారు. వీరు యూదులు మరియు క్రైస్తవుల విశ్వాసాలు, ఆచారాలు, ఆచరణలు, మరియు సంప్రదాయాలలో వారి మార్గాన్ని, అంగుళం అంగుళం, మూరలు మూరలుగా అనుసరిస్తారు; ఎంతగా అంటే వారు (యూదులు, క్రైస్తవులు) ఒకవేళ ఏదైనా ఉడుం రంధ్రములోనికి దూరితే, వీరు కూడా వాళ్ళ వెనుక అందులోనికి దూరతారు.