عَن عَائِشَةَ أُمِّ المؤْمِنين رضي الله عنها زَوْجَ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ حَدَّثَتْهُ قَالَتْ:
جَاءَتْنِي امْرَأَةٌ مَعَهَا ابْنَتَانِ تَسْأَلُنِي، فَلَمْ تَجِدْ عِنْدِي غَيْرَ تَمْرَةٍ وَاحِدَةٍ، فَأَعْطَيْتُهَا فَقَسَمَتْهَا بَيْنَ ابْنَتَيْهَا، ثُمَّ قَامَتْ فَخَرَجَتْ، فَدَخَلَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فَحَدَّثْتُهُ، فَقَالَ: «مَنْ يَلِي مِنْ هَذِهِ البَنَاتِ شَيْئًا، فَأَحْسَنَ إِلَيْهِنَّ، كُنَّ لَهُ سِتْرًا مِنَ النَّارِ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 5995]
المزيــد ...
విశ్వాసుల మాతృమూర్తి మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్యామణులలో ఒకరైన ఆయిషా రదియల్లాహు అన్హా తాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు చెప్పిన ఒక విషయాన్ని ఈ హదీథులో ఉల్లేఖిస్తున్నారు:
“ఒక స్త్రీ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి నా దగ్గరకు వచ్చి ఏమైనా దానం చేయమని అడిగింది. నా దగ్గర ఒక ఖర్జూరం తప్ప మరేమీ లేదని ఆమె గ్రహించింది, ఆ ఒక్క ఖర్జూరాన్నే నేను ఆమెకు ఇచ్చాను. ఆమె దానిని రెండు భాగాలు చేసి తన ఇద్దరు కూతుళ్లకు చెరొకటి ఇచ్చింది, (ఆ పిల్లలిద్దరు తిన్న తరువాత) ఆమె అక్కడి నుండి వెళ్లిపోయింది. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చినపుడు నేను వారికి ఈ విషయం గురించి తెలియజేసాను. అపుడు వారు ఇలా అన్నారు: “ఎవరైతే తన కూతుళ్లను జాగ్రత్తగా చూసుకుంటారో మరియు వారితో దయగా వ్యవహరిస్తారో, వారు అతనికి నరకాగ్ని నుండి రక్షణగా (తెరగా) ఉంటారు."
[ప్రామాణికమైన హదీథు] - [అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు] - [సహీహ్ అల్ బుఖారీ - 5995]
విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రదియల్లాహు అన్హా ఇలా నివేదించినారు: ఒక స్త్రీ తన ఇద్దరు కుమార్తెలతో తన వద్దకు వచ్చి తినడానికి ఏదైనా దానం చేయమని అడిగింది. ఆయిషా రదియల్లాహు అన్హా దగ్గర ఒక్క ఖర్జూరం తప్ప మరేమీ లేదు, ఆమె ఆ ఒక్క ఖర్జూరాన్ని కూడా ఆమెకు ఇచ్చివేసినారు. ఆ స్త్రీ తన ఇద్దరు కుమార్తెలకు ఖర్జూరాన్ని పంచిపెట్టింది, ఆమె దాని నుండి ఏమీ తినలేదు. తరువాత ఆమె లేచి వెళ్ళిపోయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లోపలికి ప్రవేశించారు మరియు ఆయిషా రదియల్లాహు అన్హా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు జరిగింది వివరించారు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వస్లలం ఇలా అన్నారు: తమ కుమార్తెల పట్ల బాధ్యత వహించి, వారిని జాగ్రత్తగా చూసుకుని, వారి పట్ల మంచిగా ప్రవర్తించేవాడు - వారికి విద్య నేర్పడం, తినిపించడం, తాగించడం, దుస్తులు ధరించడం మరియు ఇవన్నీ ఓపికగా భరించేవారు – అటువంటి వారికి ఆ పిల్లలు నరకాగ్ని నుండి రక్షణ కవచంగా మరియు నరకాగ్ని వారిని తాకకుండా ఒక అడ్డుతెరగా ఉంటారు.