عَنْ أَنَسِ بْنِ مَالِكٍ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«مَنْ عَالَ جَارِيَتَيْنِ حَتَّى تَبْلُغَا جَاءَ يَوْمَ الْقِيَامَةِ أَنَا وَهُوَ» وَضَمَّ أَصَابِعَهُ.
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2631]
المزيــد ...
అనస్ ఇబ్న్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ఎవరైతే ఇద్దరు ఆడపిల్లలను యుక్తవయస్సుకు చేరే వరకు వారి పోషణ, బాగోగులు చూస్తూ పెంచి, పోషిస్తాడో అతడు మరియు నేను తీర్పుదినమునాడు ఈ విధంగా ఉంటాము” అంటూ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన రెండు వ్రేళ్ళను ఒక్కటిగా కలిపి చూపినారు.”
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 2631]
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు – ఎవరైతే ఇద్దరు కూతుళ్లు లేదా ఇద్దరు అక్కచెళ్ళెల్లు కలిగి ఉండి వారి మంచిచెడులు, బాగోగులు చూస్తూ, మంచిపనులు చేయుటకు వారికి మార్గనిరర్దేశం చేస్తూ, చెడుపనుల నుంచి వారిని హెచ్చరిస్తూ వారు పెద్దవాళ్లు అయ్యే వరకు వారిని పెంచిపోషిస్తాడో, అటువంటి వ్యక్తి మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఇద్దరూ ప్రళయదినమున ఈ రెండింటి మాదిరిగా (అంటే అంత దగ్గరగా) వస్తారు అంటూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చూపుడు వ్రేలు మరియు మధ్య వ్రేలును కలిపి చూపినారు.