عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«لَا تَدْخُلُونَ الْجَنَّةَ حَتَّى تُؤْمِنُوا، وَلَا تُؤْمِنُوا حَتَّى تَحَابُّوا، أَوَلَا أَدُلُّكُمْ عَلَى شَيْءٍ إِذَا فَعَلْتُمُوهُ تَحَابَبْتُمْ؟ أَفْشُوا السَّلَامَ بَيْنَكُمْ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 54]
المزيــد ...
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“మీరు (ఇస్లాం యొక్క విశ్వాసపు మూలస్థంభాలన్నింటినీ) విశ్వసించనంత వరకు స్వర్గములో ప్రవేశింపలేరు. మరియు మీరు ఒకరినొకరు ప్రేమించనంత వరకు మీరు విశ్వసించలేరు (విశ్వాసులు కాలేరు). మీకొక విషయం చెప్పనా – ఒకవేళ మీరు ఇలా చేస్తే మీరు ఒకరినొకరు ప్రేమిస్తారు అంటే సలాం చేయడాన్ని మీ మధ్య బాగా వ్యాప్తి చేయండి.”
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 54]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక విషయాన్ని స్పష్ట పరిచినారు – అది విశ్వాసులు స్వర్గములోనికి ప్రవేశిస్తారు. అయితే వారు ఒకరినొకరు ప్రేమించనంత వరకు విశ్వాసము సంపూర్ణము కాదు, మరియు ముస్లిం సమాజము యొక్క స్థితి కూడా వృధ్ధి చెందదు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – ముస్లిం సమాజములో ప్రేమ ప్రవర్థిల్లు ఆచరణల వైపునకు మనలకు మార్గదర్శకం చేసినారు – అది ఏమిటంటే, అల్లాహ్ తన దాసులు ఒకరినొకరు అభివందనం చేయుట కొరకు సూచించిన “సలాము”, దానిని వ్యాపింపజేయమని తెలిపినారు.