عَنْ حُمْرَانَ مَوْلَى عُثْمَانَ بْنِ عَفَّانَ رضي الله عنه:
أَنَّهُ رَأَى عُثْمَانَ بْنَ عَفَّانَ دَعَا بِوَضُوءٍ، فَأَفْرَغَ عَلَى يَدَيْهِ مِنْ إِنَائِهِ، فَغَسَلَهُمَا ثَلَاثَ مَرَّاتٍ، ثُمَّ أَدْخَلَ يَمِينَهُ فِي الْوَضُوءِ، ثُمَّ تَمَضْمَضَ وَاسْتَنْشَقَ وَاسْتَنْثَرَ، ثُمَّ غَسَلَ وَجْهَهُ ثَلَاثًا، وَيَدَيْهِ إِلَى الْمِرْفَقَيْنِ ثَلَاثًا، ثُمَّ مَسَحَ بِرَأْسِهِ، ثُمَّ غَسَلَ كُلَّ رِجْلٍ ثَلَاثًا، ثُمَّ قَالَ: رَأَيْتُ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَتَوَضَّأُ نَحْوَ وُضُوئِي هَذَا، وَقَالَ: «مَنْ تَوَضَّأَ نَحْوَ وُضُوئِي هَذَا ثُمَّ صَلَّى رَكْعَتَيْنِ لَا يُحَدِّثُ فِيهِمَا نَفْسَهُ غَفَرَ اللهُ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 164]
المزيــد ...
హుమ్రాన్ మౌలా (ఈయన ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు యొక్క బానిసలలో ఒకరు. ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ ఈయనకు స్వేచ్ఛ ప్రసాదించి, బానిసత్వము నుండి విముక్తి చేసినారు) ఉల్లేఖన: అతను ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు వుజూ చేయుట కొరకు నీళ్ళు తెప్పించగా చూసినారు. అపుడు ఆయన (ఉస్మాన్ రజియల్లాహు అన్హు) (ఆ నీటి పాత్ర నుండి) తన రెండు చేతులపై నీళ్ళను వొంపుకుని మూడు సార్లు బాగా కడిగినారు. తరువాత నీటిలో తన కుడి చేతిని వేసి, గుప్పెడు నీళ్ళతో తన నోటినీ మరియు ముక్కునూ శుభ్రపర్చుకున్నారు. తరువాత ఆయన తన ముఖాన్ని మూడు సార్లు కడుగుకున్నారు, తన చేతులను మోచేతుల వరకు మూడు సార్లు కడిగినారు. తరువాత (తడి అరచేతులతో) తన తలను తుడిచినారు. తరువాత తన పాదాలను (చీలమండలాల వరకు) మూడు సార్లు కడిగినారు. తరువాత ఆయన ఇలా అన్నారు: “ఇపుడు నేను ఏవిధంగా ఉదూ చేసినానో, అదే విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేయగా నేను చూసినాను. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారని తెలిపినారు “ఎవరైతే నేను చేసిన విధంగా వుజూ చేసి, తరువాత నిలబడి, రెండు రకాతుల నమాజును ఖుషూతో అంటే ఆ రకాతులలో తన మనసు, తన ఆలోచనలు ఎటూ పోకుండా, నమాజుపైనే నిలిపి ఆచరిస్తాడో, అతడి పూర్వపు పాపాలు క్షమించి వేయబడతాయి.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 164]
ఉస్మాన్ రజియల్లాహు అన్హు ఆచరణాత్మకంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వుజూ విధానాన్ని బోధించినారు. బాగా స్పష్టంగా ఉండేందుకు గాను, ఆయన ఒక పాత్రలో నీళ్ళు తెమ్మని అడిగారు. అందులో నుంచి తన చేతులపై నీళ్ళు ఒలుపుకుని మూడు సార్లు తన చేతులను కడిగినారు. తరువాత తన కుడి చేతిని నీళ్ళు ఉన్న పాత్రలో పెట్టి, అందునుండి నీళ్ళు తీసుకుని తన నోటిలో పోసుకుని బాగా పుక్కిలించి ఉమ్మివేసినారు, తరువాత తన ముక్కులోనికి నీరు పోనిచ్చి, చీదుతూ బయటకు తీసినారు, తరువాత ఆయన తన ముఖాన్ని మూడు సార్లు కడిగినారు, తరువాత ఆయన తన చేతులను మోచేతుల సమేతంగా మూడు సార్లు కడిగినారు, తరువాత తన అరచేతులను తడి చేసుకుని, తడిచేతులను ఒకసారి తన తలపై నుంచి పోనిచ్చినారు, తరువాత తన పాదాలను చీలమండలాల సమేతంగా మూడుసార్లు కడిగినారు.
తరువాత ఆయన రజియల్లాహు అన్హు అక్కడి వారితో తాను చేసి చూపిన విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేయగా తాను చూసినాను అని తెలిపినారు; మరియు వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శుభవార్తను కూడా వినిపించినారు - ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసి చూపిన విధంగా వుజూ చేసి, ఖుషూతో రెండు రకాతుల నమాజును అంటే తన హృదయాన్ని సర్వ శక్తిమంతుడూ, సర్వోన్నతుడూ అయిన తన ప్రభువు సమక్షమున నిలిపి ఉంచి ఆచరిస్తాడో, అల్లాహ్ అతనికి - పరిపూర్ణంగా ఉదూ చేసి, కేవలం అల్లాహ్ కొరకే రెండు రకాతుల నమాజు ఆచరించినందుకు గాను అతని పూర్వ పాపాలు క్షమించడం ద్వారా అతనికి ప్రతిఫలం ప్రసాదిస్తాడు.