عَن أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ:
سَأَلَ رَجُلٌ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: يَا رَسُولَ اللهِ، إِنَّا نَرْكَبُ البَحْرَ، وَنَحْمِلُ مَعَنَا القَلِيلَ مِنَ الْمَاءِ، فَإِنْ تَوَضَّأْنَا بِهِ عَطِشْنَا، أَفَنَتَوَضَّأُ مِنَ الْبَحْرِ؟ فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: «هُوَ الطَّهُورُ مَاؤُهُ، الحِلُّ مَيْتَتُهُ».
[صحيح] - [رواه أبو داود والترمذي والنسائي وابن ماجه وأحمد] - [سنن الترمذي: 69]
المزيــد ...
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన:
“రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఒక వ్యక్తి ఇలా అడిగాడు: “ఓ రసూలల్లాహ్! మేము సముద్రంపై ప్రయాణిస్తూ ఉంటాము. మేము మా వెంట పరిమితంగా మంచి నీళ్ళు తీసుకు వెళుతాము. మేము ఆ నీటితో ఉదూ గానీ, గుసుల్ గానీ చేసినట్లయితే (నీళ్ళు అయిపోయి) మేము దాహంతో బాధపడ వలసి వస్తుంది. మరి మేము సముద్రపు నీటితో ఉదూ, గుసుల్ చేయవచ్చునా?” దానికి రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “సముద్రపు నీరు పరిశుద్ధమైనది, మరియు చనిపోయిన సముద్రపు జంతువులు తినుటకు అనుమతించబడినవి.”
[దృఢమైనది] - - [سنن الترمذي - 69]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఒక వ్యక్తి ఇలా అడిగాడు: మేము సముద్రంపై నావలలో, పడవలలో వ్యాపారం నిమిత్తం, చేపలు పట్టే నిమిత్తం ప్రయాణిస్తూ ఉంటాము. మేము మా వెంట త్రాగడానికి కొద్దిపాటి మంచి నీళ్ళు తీసుకువెళతాము. మేము ఈ మంచి నీళ్ళను ఉదూ చేయడానికి, లేదా గుసుల్ చేయడానికి ఉపయోగించినట్లయితే మా వద్ద త్రాగడానికి మంచినీళ్ళ కొరత ఏర్పడుతుంది; ఇంక మాకు ఏమీ లభించదు. సముద్రపు నీటితో ఉదూ, గుసుల్ చేయుటకు మాకు అనుమతి ఉన్నదా?”
అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సముద్రపు నీటిని గురించి ఇలా అన్నారు: “దాని నీరు పరిశుద్ధమైనది మరియు పరిశుద్ధ పరుచునటువంటిది. దానితో ఉదూ మరియు గుసుల్ చేయుట అనుమతించబడినది; మరియు సముద్రం నుండి బయటకు తీసుకురాబడే (సముద్రంలో లభించే) దేనినైనా, ఉదాహరణకు చేపలు, వేల్ చేప వంటి జంతువులు మొదలైనవి, వాటిని పట్టుకొనడానికి ముందే అవి చనిపోయి సముద్రపు నీటిపై తేలియాడుతూ ఉన్నప్పటికీ, వాటిని తినుటకు అనుమతి ఉన్నది (హలాల్).