عَن عَبْدِ اللَّهِ بْنِ عُمَرَ رضي الله عنهما قَالَ: سُئِلَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ عَنِ الْمَاءِ وَمَا يَنُوبُهُ مِنَ الدَّوَابِّ وَالسِّبَاعِ، فَقَالَ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«إِذَا كَانَ الْمَاءُ قُلَّتَيْنِ لَمْ يَحْمِلِ الْخَبَثَ».
[صحيح] - [رواه أبو داود والترمذي والنسائي وابن ماجه وأحمد] - [سنن أبي داود: 63]
المزيــد ...
అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంను పశువులు మరియు వేటాడే జంతువులు తరుచూ త్రాగుతూ ఉండే నీటిని గురించి (వాటిని ఉపయోగించ వచ్చునా) అని ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ఆ నీరు ఒకవేళ “ఖుల్లతైన్”లకు (రెండు పెద్ద కుండల నిండుగా ఉన్న నీటికి) సమానంగా ఉంటే అది మాలిన్యాన్ని గ్రహించదు.”
[దృఢమైనది] - - [سنن أبي داود - 63]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను జంతువులు మరియు క్రూర జంతువులు తరుచూ త్రాగుతూ ఉండే నీటి వనరులలోని నీటి పరిశుద్ధత గురించి ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఒకవేళ ఆ నీరు “ఖుల్లతైన్”లకు (రెండు పెద్ద కుండల నిండుగా ఉన్న నీటికి), అంటే దాదాపు 210 లీటర్లకు సమానంగా ఉంటే అది పెద్ద మొత్తంలో ఉన్న నీరుగా భావించబడుతుంది; అది మాలిన్యాన్ని గ్రహించదు, అశుద్ధత కారణంగా ఆ నీటి మూడు లక్షణాలైన రంగు, రుచి, వాసనలలో ఏ ఒక్క లక్షణమైనా మారనంత వరకు.