عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«إِذَا اسْتَيْقَظَ أَحَدُكُمْ مِنْ مَنَامِهِ فَلْيَسْتَنْثِرْ ثَلَاثَ مَرَّاتٍ، فَإِنَّ الشَّيْطَانَ يَبِيتُ عَلَى خَيَاشِيمِهِ».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 238]
المزيــد ...
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“మీలో ఎవరైనా ఒకవేళ నిద్ర నుంచి లేచినట్లయితే అతడు నీటితో ముక్కును మూడు సార్లు శుభ్రపరుచుకోవాలి, ఎందుకంటే షైతాను అతని ముక్కుపుటాలపై రాత్రి గడుపుతాడు కనుక.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 238]
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హితబోధ చేస్తున్నారు: ఎవరైతే నిద్రలేస్తారో వారు ముక్కును నీటితో మూడుసార్లు శుభ్రపరుచుకోవాలి. ముక్కును నీటితో శుభ్రపరుచుకోవడం అంటే, ముక్కులోనికి నీరు ఎక్కించి తరువాత ఆ నీటిని చీది వేయడం. ఎందుకంటే షైతాను అతని ముక్కు పుటాల మీద రాత్రి గడుపుతాడు కనుక; అంటే పూర్తి ముక్కుపై.