عَنْ جَابِرِ بْنِ عَبْدِ اللَّهِ رَضِيَ اللَّهُ عَنْهُمَا أَنَّهُ سَمِعَ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، يَقُولُ عَامَ الفَتْحِ وَهُوَ بِمَكَّةَ:
«إِنَّ اللَّهَ وَرَسُولَهُ حَرَّمَ بَيْعَ الخَمْرِ، وَالمَيْتَةِ وَالخِنْزِيرِ وَالأَصْنَامِ»، فَقِيلَ: يَا رَسُولَ اللَّهِ، أَرَأَيْتَ شُحُومَ المَيْتَةِ، فَإِنَّهَا يُطْلَى بِهَا السُّفُنُ، وَيُدْهَنُ بِهَا الجُلُودُ، وَيَسْتَصْبِحُ بِهَا النَّاسُ؟ فَقَالَ: «لاَ، هُوَ حَرَامٌ»، ثُمَّ قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ عِنْدَ ذَلِكَ: «قَاتَلَ اللَّهُ اليَهُودَ إِنَّ اللَّهَ لَمَّا حَرَّمَ شُحُومَهَا جَمَلُوهُ، ثُمَّ بَاعُوهُ، فَأَكَلُوا ثَمَنَهُ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 2236]
المزيــد ...
మక్కా విజయం (ఫతహ్ మక్కా) జరిగిన సంవత్సరం, ఆ సందర్భముగా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో ఉన్నపుడు ఆయన ఇలా అనగా తాను విన్నాను అని జాబిర్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖిస్తున్నారు:
“నిశ్చయంగా అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు – సారాయి, చనిపోయిన జంతువులు, పందులు మరియు విగ్రహాలను అమ్మడాన్ని నిషేధించినారు”. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ఈ విధంగా నివేదించబడినది “ఓ రసూలల్లాహ్ (స)! మరి చనిపోయిన జంతువులనుండి తీసే కొవ్వు గురించి మీ అభిప్రాయం ఏమిటి? అది ఓడలకు, మరియు చర్మాలకు (అవి పాడుకాకుండా) పూయబడుతుంది; మరియు ప్రజలు దానిని దీపాలలో (చమురుగా) వాడుతారు”. దానికి ఆయన (స) “లేదు, అది హరాం” అన్నారు. తరువాత రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సందర్భముగా ఇలా అన్నారు: “యూదులను అల్లాహ్ నాశనం చేయుగాక! నిశ్చయంగా అల్లాహ్ (చనిపోయిన జంతువుల) కొవ్వును వారికి నిషేధించినాడు. కానీ వారు దాని కరిగించారు, దానిని అమ్మినారు మరియు దానినుండి వచ్చిన సొమ్మును తిన్నారు.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 2236]
జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హుమా) మక్కా విజయం సంవత్సరములో, ఆ సందర్భముగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో ఉన్నపుడు, ఆయన ఇలా అనడం విన్నారు: “నిశ్చయంగా అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు మద్యము, మృత జంతువులు, పందులు, మరియు విగ్రహాల అమ్మకాలను నిషేధించినారు.” ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా అడగడం జరిగింది: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మరి చనిపోయిన జంతువుల కొవ్వును అమ్మడానికి అనుమతి ఉందా? ఎందుకంటే దానిని ఓడలకు పూత పూయడానికి, చర్మాలకు (అవి చెడిపోకుండా) గ్రీజులాగా రాయడానికి, మరియు ప్రజలు తమ దీపాలను వెలిగించడానికి ఉపయోగిస్తారు” అని. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “లేదు అది నిషేధము” అన్నారు. ఆ సందర్భముగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “అల్లాహ్ యూదులను నాశనం చేసి వారిని శపించాడు. అల్లాహ్ వారిపై పశువుల కొవ్వులను నిషేధించినప్పుడు, వారు దానిని కరిగించి, దానిని అమ్మి, దాని ధరను తిన్నారు.