+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه عَنْ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«مَنْ سَبَّحَ اللهَ فِي دُبُرِ كُلِّ صَلَاةٍ ثَلَاثًا وَثَلَاثِينَ، وَحَمِدَ اللهَ ثَلَاثًا وَثَلَاثِينَ، وَكَبَّرَ اللهَ ثَلَاثًا وَثَلَاثِينَ، فَتْلِكَ تِسْعَةٌ وَتِسْعُونَ، وَقَالَ: تَمَامَ الْمِائَةِ: لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ غُفِرَتْ خَطَايَاهُ وَإِنْ كَانَتْ مِثْلَ زَبَدِ الْبَحْرِ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 597]
المزيــد ...

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి, ఆయన ఇలా పలికినారు:
“ఎవరైతే (ప్రతిరోజూ విధిగా ఆచరించ వలసిన) ప్రతి నమాజు తరువాత ముప్ఫై మూడు సార్లు “సుబ్’హానల్లాహ్” అని, ముప్ఫై మూడు సార్లు “అల్’హందులిల్లాహ్” అని, ముప్ఫై మూడు సార్లు “అల్లాహు అక్బర్” అని ఉచ్ఛరిస్తాడో, అవి మొత్తం తొంభైతొమ్మిది అవుతాయి”; ఆయన ఇంకా ఇలా అన్నారు: “వాటిని “లాఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లాషరీకలహు, లహుల్ ముల్కు, వలహుల్ హమ్దు, వహువ అలాకుల్లి షైఇన్ ఖదీర్” అని ఉచ్ఛరించి మొత్తం వందగా పూర్తి చేస్తాడో, అతని పాపాలన్నీ క్షమించివేయబడతాయి, అవి సముద్రపు నురగ అంత అధికంగా ఉన్నా సరే.”

[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 597]

వివరణ

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: ‘విధిగా ఆచరించవలసిన ప్రతి నమాజు తరువాత ఎవరైతే ఈ క్రింది విధంగా ఉచ్చారిస్తారో:
“సుబ్’హానల్లాహ్” అని ముప్ఫైమూడు సార్లు, అంటే దాని అర్థం “అల్లాహ్ లోపాలకు అతీతమైన వాడు” అని;
అలాగే “అల్’హమ్దులిల్లాహ్” అని ముప్ఫైమూడు సార్లు, అంటే దాని అర్థం “అన్ని రకాల స్తుతులు, ప్రశంసలు అన్నీ కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే” అని; అంటే ఆయనపై ప్రేమతో, ఆయనను మహిమ పరచడం, దానితో పాటు ఆయన యొక్క పరిపూర్ణ గుణ,లక్షణాలతో ఆయనను స్తుతించడం.
అలాగే “అల్లాహు అక్బర్” అని ముప్ఫైమూడు సార్లు, అంటే దాని అర్థం అల్లాహ్ అన్నిటి కంటే మరియు అందరి కంటే గొప్పవాడు మరియు ఘనమైన వాడు, దివ్యమైనవాడు అని అర్థం – అలా ఉచ్ఛరించి;
వాటిని ఈ పదాలతో వాటి సంఖ్య మొత్తం వంద పూర్తి అయ్యేలా చేయాలి: “లాఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లాషరీకలహు, లహుల్ ముల్కు, వలహుల్ హందు, వహువ అలాకుల్లి షైఇన్ ఖదీర్” (అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, ఆయన అద్వితీయుడు (ఏకైకుడు); తనకు సమానం గానీ, సాటి గానీ, భాగస్వాములు గానీ ఎవరూ లేని వాడు, విశ్వ సామ్రాజ్యం ఆయనదే, ప్రశంసలు, పొగడ్తలు అన్నీ ఆయనకే చెందుతాయి, ఆయన ప్రతి విషయంపై అధికారం గలవాడు) – అంటే దాని అర్థము: ఏకైకుడూ, తన ప్రభుతలో సాటి గానీ, భాగస్వామి గానీ ఎవరూ లేని వాడు అయిన అల్లాహ్ తప్ప వేరే నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు ఆయనే లోపాలకు అతీతుడు, పరమ పవిత్రుడు, మరియు విశ్వసామ్రాజ్యంపై సంపూర్ణ ఆధిపత్యం గలవాడు. మరియు ఆయనే అందరికంటే ఎక్కువగా ప్రశంసలు, ప్రేమ మరియు గౌరవాలకు అర్హుడు. ఆయన సర్వశక్తిమంతుడు, సమర్థుడు మరియు ఏ విషయామూ ఆయనను అశక్తుని, నిస్సహాయుని చేయలేదు; ఆయన శక్తిని అధిగమించగలిగినది ఏదీ లేదు.
ఎవరైతే అలా పలికి వంద పూర్తి చేస్తారో, అతడి పాపాలన్నీ తుడిచివేయబడతాయి, అతడు క్షమించబడతాడు; అతడి పాపాలు సముద్రం ఉప్పొంగినప్పుడు మరియు ఉధృతంగా ఉన్నప్పుడు పైకి లేచే తెల్లని నురుగ లాగా ఎంత అధికంగా ఉన్నప్పటికీ.

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ పష్టో అస్సామీ السويدية الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية Юрба الدرية الصومالية Кинёрвондӣ الرومانية Малагашӣ Урумӣ
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ఈ పదాలను, విధిగా ఆచరించవలసిన ప్రతి సలాహ్ తరువాత (ప్రతి ఫర్జ్ సలాహ్ తరువాత), పఠించాలని సిఫారసు చేయబడుతున్నది.
  2. మన పాపములు క్షమించబడుటకు ఈ పదాలు పఠించడం కూడా ఒక కారణం కాగలదు.
  3. ఇందులో సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క ఘనత, ఆయన యొక్క గొప్ప దయ, కరుణ మరియు క్షమాశీలత తెలుస్తున్నాయి.
  4. విధిగా ఆచరించవలసిన ప్రతి సలాహ్ తరువాత చేయు ఈ స్మరణ పాప క్షమాపణ కొరకు ఒక కారణం: అంటే దాని అర్థము, ఈ స్మరణ చిన్నచిన్న పాపములకు పరిహారంగా మారుతుంది; పెద్ద పాపముల కొరకు పశ్చాత్తాపపడాలి, పశ్చాత్తాపము మాత్రమే పెద్ద పాపములకు పరిహారంగా మారుతుంది.
ఇంకా