عَنْ يحيى بنِ عُمَارةَ المَازِنِيِّ قَالَ:
شَهِدْتُ عَمْرَو بْنَ أَبِي حَسَنٍ سَأَلَ عَبْدَ اللَّهِ بْنَ زَيْدٍ، عَنْ وُضُوءِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فَدَعَا بِتَوْرٍ مِنْ مَاءٍ، فَتَوَضَّأَ لَهُمْ وُضُوءَ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَأَكْفَأَ عَلَى يَدِهِ مِنَ التَّوْرِ، فَغَسَلَ يَدَيْهِ ثَلاَثًا، ثُمَّ أَدْخَلَ يَدَهُ فِي التَّوْرِ، فَمَضْمَضَ وَاسْتَنْشَقَ وَاسْتَنْثَرَ، ثَلاَثَ غَرَفَاتٍ، ثُمَّ أَدْخَلَ يَدَهُ فَغَسَلَ وَجْهَهُ ثَلاَثًا، ثُمَّ غَسَلَ يَدَيْهِ مَرَّتَيْنِ إِلَى المِرْفَقَيْنِ، ثُمَّ أَدْخَلَ يَدَهُ فَمَسَحَ رَأْسَهُ، فَأَقْبَلَ بِهِمَا وَأَدْبَرَ مَرَّةً وَاحِدَةً، ثُمَّ غَسَلَ رِجْلَيْهِ إِلَى الكَعْبَيْنِ.
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 186]
المزيــد ...
యహ్యా ఇబ్న్ ఉమారహ్ అల్ మజీని రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
“అమ్ర్ ఇబ్న్ అబీ హసన్, అబ్దుల్లాహ్ ఇబ్న్ జైద్ రజియల్లాహు అన్హు ను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వుజూ విధానానం గురించి ప్రశ్నించడం నేను చూసాను. దానితో ఆయన ఒక చిన్న పాత్రలో నీళ్ళు తీసుకు రమ్మని ఒకరికి పురమాయించారు.దానితో ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన విధంగా వుజూ చేసినారు. (ముందుగా) ఆయన ఆ నీటి పాత్రను వొంపి చేతులపై నీళ్ళు పోసుకుని, రెండు చేతులను మూడు సార్లు కడిగినారు. తరువాత ఆ పాత్రలో చేయి పెట్టి చేతి నిండా నీళ్ళు తీసుకుని నోటిలో పుక్కిలించి, (ముక్కు లోనికి నీళ్ళు ఎక్కించి) ముక్కును చీది (నోటినీ, ముక్కునూ) మూడు సార్లు శుభ్రపరుచుకున్నారు. తరువాత ఆ పాత్రలో చేయి పెట్టి చేతి నిండా (మూడు సార్లు) నీళ్ళు తీసుకుని ముఖాన్ని మూడు సార్లు కడిగినారు; తరువాత నీటి పాత్రలో చేయి పెట్టి, నీటితో రెండు చేతులను మోచేతుల సమేతంగా రెండుసార్లు కడిగినారు; తరువాత నీటి పాత్రలో చేతులు పెట్టి (తడి చేతులతో) తలను ఒకసారి మసాహ్ చేసినారు (తడిమినారు) – చేతులను తల ముందు భాగము నుండి వెనుకకు తీసుకు వెళ్ళి, వెనుకనుండి ముందుకు తెచ్చినారు. తరువాత పాదాలను చీలమండలముల వరకు కడిగినారు.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 186]
ఈ హదీసులోఅబ్దుల్లాహ్ ఇబ్న్ జైద్ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వుజూ విధానాన్ని వాస్తవ రూపములో (ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన విధంగా) చేసి వివరిస్తున్నారు. ఆయన ఒక చిన్న పాత్ర నిండా నీళ్ళు తీసుకురమ్మని అడిగారు. ముందుగా ఆయన తన రెండు చేతులను కడిగినారు – అందుకు ఆయన నీటి పాత్రను వొంచి నీటితో తన రెండు చేతులను మణికట్టు వరకు మూడు సార్లు, నీటి పాత్ర బయట, కడిగినారు. అపుడు ఆయన ఆ నీటి పాత్రలో చేయి పెట్టి మూడు సార్లు చేతి నిండా నీళ్ళు తీసుకుని (ఆ నీటితో) తన నోటిని పుక్కిలించి, ముక్కును చీది శుభ్రపరుచు కున్నారు. తరువాత ఆయన నీటి పాత్ర నుండి (అదే విధంగా మూడు సార్లు చేతి నిండా) నీళ్ళు తీసుకుని మూడు సార్లు తన ముఖాన్ని కడిగినారు. తరువాత ఆయన నీటి పాత్ర నుండి రెండు సార్లు చేతి నిండా నీళ్ళు తీసుకుని తన రెండు చేతులను మోచేతుల సమేతంగా కడిగినారు. తరువాత ఆయన రెండు చేతులను నీటి పాత్రలో పెట్టి, తడి అరచేతులతో తల మసాహ్ చేసినారు (తడిమినారు); ముందుగా ఆయన తన రెండు తడి అరచేతులను తల ముందు భాగము నుండి మొదలు పెట్టి తల వెనుక భాగాన మెడ వరకు తీసుకు వెళ్ళి, తరువాత అవే అరచేతులను అలాగే తల ముందు భాగానికి, ఎక్కడి నుండి మొదలు పెట్టినారో అక్కడికి, తీసుకు వచ్చినారు. అప్పుడు ఆయన రెండు పాదాలను చీలమండలాల వరకు కడిగినారు.