عَنْ أَبِي الحَوْرَاءِ السَّعْدِيِّ قَالَ: قُلْتُ لِلْحَسَنِ بْنِ عَلِيٍّ رضي الله عنهما: مَا حَفِظْتَ مِنْ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ؟ قَالَ: حَفِظْتُ مِنْ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:
«دَعْ مَا يَرِيبُكَ إِلَى مَا لاَ يَرِيبُكَ، فَإِنَّ الصِّدْقَ طُمَأْنِينَةٌ، وَإِنَّ الكَذِبَ رِيبَةٌ».
[صحيح] - [رواه الترمذي والنسائي وأحمد] - [سنن الترمذي: 2518]
المزيــد ...
అబూ అల్ హవ్’రా అస్-స’దీ ఇలా పలికినారు: “హసన్ ఇబ్న్ అలీ బిన్ అబీ తాలిబ్ (రదియల్లాహు అన్హుమా) ను నేను ఇలా అడిగాను: “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి నీవు ఏమి కంఠస్థము చేసినావు?” దానికి ఆయన ఇలా బదులు పలికినారు: రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి నేను దీనిని కంఠస్థము చేసినాను -
“సందేహాస్పదమైన విషయాన్ని, సందేహాస్పదం కాని దాని కొరకు (స్పష్టంగా ఉన్న దాని కొరకు) వదిలి వేయి. నిశ్చయంగా సత్యసంధత ప్రశాంతతను కలిగిస్తుంది, అసత్యం అనుమానానికి దారి తీస్తుంది”
[దృఢమైనది] - - [سنن الترمذي - 2518]
సందేహాలకు, అనుమాలకు దారి తీసే ఏవైనా మాటలు కానీ, చేతలు కానీ ఉంటే, వాటిని వదిలి వేయాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించినారు; అవి నిషేధించబడిన విషయాలు అయినా, కాకపోయినా సరే, అవి అనుమతించబడిన విషయాలు అయినా లేదా నిషేధించబడిన విషయాలు అయినా సరే – వాటికి బదులుగా కేవలం వాటినే ఎంచుకొండి వేటిలోనైతే సందేహాలకు, అనుమాలకు తావు లేదో; వేటి గురించైతే అవి మంచివి అనీ, పరిశుద్ధమైనవి అనీ, చట్టసమ్మతమైనవి అనీ (షరియత్ ఆమోదించినవని) మీకు ఖచ్చితంగా తెలుసునో వాటిని మాత్రమే ఎంచుకోండి. ఎందుకంటే వాటిలో హృదయం శాంతి మరియు ప్రశాంతతను పొందుతుంది, కానీ సందేహాన్ని కలిగించే, అనుమానాలు రేకెత్తించే విషయాలు హృదయాన్ని ఆందోళనకు మరియు కలతకు గురి చేస్తాయి.