عَنِ ابْنِ عَبَّاسٍ رضي الله عنهما قَالَ:
تَوَضَّأَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ مَرَّةً مَرَّةً.
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 157]
المزيــد ...
అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం :
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేయునపుడు శరీరభాగాలను ఒక్కొక్కసారే కడిగినారు.”
[దృఢమైనది] - [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు] - [صحيح البخاري - 157]
వుజూ చేయవలసి వచ్చినపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొన్నిసార్లు, (వుజూలో కడగవలసిన) ఒక్కొక్క శరీర భాగాన్ని ఒక్కసారే కడిగేవారు; అంటే తన ముఖాన్ని – నోటిని పుక్కిలించడం, ముక్కును చీది శుభ్రపరుచు కోవడంతో సహా – చేతులను కాళ్ళనూ ఒక్కసారే కడిగేవారు. ఇది, అంటే కనీసం ఒక్కసారి కడుగుట అనునది విధి (వాజిబ్).