عن أبي هريرة رضي الله عنه قال: «لَعَن رسول الله صلى الله عليه وسلم الرَّاشِي والمُرْتَشِي في الحُكْم».
[صحيح] - [رواه الترمذي وأحمد]
المزيــد ...

అబూహురైర రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు:మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తీర్పువిషయంలో లంచం ఇచ్చువాడిని మరియు పుచ్చుకునువాడిని శపించారు.
దృఢమైనది - దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారు

వివరణ

లంచం యొక్క వాస్తవం ఏమిటంటే ‘డబ్బు ఖర్చుచేసి అన్యాయంగా దాని ద్వారా పొందటం,మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ‘ లంచం ఇచ్చేవాడు మరియు పుచ్చుకునేవాడు అల్లాహ్ యొక్క కరుణా కటాక్షాల నుండి దుత్కరించబడాలని,దుఆ చేశారు,ఎందుకంటే ఈ అవినీతి ఒక వ్యక్తికి మరియు పూర్తి సమాజానికి అపారమైన నష్టాన్ని కలిగిస్తుంది,కాబట్టి బేషరతుగా షరీఅతు దీనిని పూర్తిగా నిషేదించింది,ఈ హదీసులో లంచం ప్రస్తావన ముఖ్యంగా తీర్పుకు కేటాయించబడింది,ఎందుకంటే లంచం అధికంగా షరీఆ తీర్పును తారుమారు చేయడానికీ ఉపయోగించబడుతుంది,వాస్తవానికి శిక్షను మార్చడానికి లేదా తగ్గించడానికి మరియు లంచము ఇచ్చేవాడి ప్రయోజనం నిమిత్తం న్యాయమూర్తికి లంచం ఇవ్వబడుతుంది.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية الدرية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. అవినీతికి సహాయపడుతూ అన్యాయంగా లంచాలు ఇవ్వడం,తీసుకోవడం,వాటిలో మధ్యవర్తిత్వం వహించడం మరియు వారికి సహాయం చేయడం పూర్తిగా నిషేధించబడింది.
  2. లంచం ఘోరపాపాలలో ఒకటి,ఎందుకంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ దానిని ఇచ్చేవారిని మరియు స్వీకరించేవారిని శపించారు,’శాపం’శపించడం అనేవి ఘోరపాపాల్లో ఒక మహాపాపంగా పరిగణించబడుతుంది,ఉలమాలు ధార్మిక వేత్తలు,పండితులు ఇది నిషేధించబడిందని ఏకగ్రీవంగా అంగీకరించారు.
  3. న్యాయవ్యవస్థ మరియు న్యాయతీర్పు విషయంలో లంచం ఇవ్వడం చాలా పెద్ద నేరం,మరియు మరింత పాపాత్మకమైనది, ఎందుకంటే ఇది ప్రజల సంపదను చట్టవిరుద్ధంగా అన్యాయంగా వినియోగించడం మరియు మహోన్నతుడైన దేవుని తీర్పును మార్చడం మరియు అల్లాహ్ గ్రంధానికి విముఖతచూపుతూ తీర్పు వెల్లడించడం అవుతుంది,లంచగొండి దాన్ని తీసుకుని తనపై దౌర్జన్యం చేసుకున్నాడు,దావావేసినవాడిపై దౌర్జన్యం చేశాడు,నేరస్తుడిపై దౌర్జన్యం చేశాడు.
ఇంకా