عن عمران بن حصين رضي الله عنهما قال: كانت بي بَوَاسيرُ، فسألت النبي صلى الله عليه وسلم عن الصلاة، فقال: «صَلِّ قائما، فإن لم تستطع فقاعدا، فإن لم تستطع فعلى جَنْبٍ».
[صحيح] - [رواه البخاري]
المزيــد ...

ఇమ్రాన్ బిన్ హుస్సేన్ రదియల్లాహు అన్హుమ ఉల్లేఖిస్తు తెలిపారు : నాకు మూలశంక వ్యాధి (పైల్స్)ఉండేది,నేను మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తో నమాజు ఎలా చదవాలని అడిగాను,దానికి ఆయన:నిలబడి చదువు,అలా చదివే శక్తి లేకపోతే కూర్చుని చదువు ఆ శక్తి కూడా లేకపోతే పడుకుని చదువు’అని చెప్పారు.
దృఢమైనది - దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు

వివరణ

ఒక వ్యక్తి పైల్స్ ‘తో బాధపడుతుంటే,నిలబడినప్పుడు నొప్పిని అనుభవిస్తే లేదా ఇలాంటి ఇతర సమస్యలు ఉంటే నమాజు ఎలా ప్రార్థించాలో ఈ గొప్ప హదీసు వివరిస్తుంది.ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలియపరుస్తూ ప్రాథమికంగా నిలబడి నమాజు ఆచరించబడుతుంది కానీ ఏదైనా సమస్య ఉన్నప్పుడు అలా ఆచరించలేకపోతే,అప్పుడు కూర్చోని నమాజు ఆచరించవచ్చు,ఒకవేళ కూర్చుని ఆచరించే శక్తి కూడా అతనికి లేకపోతే అలాంటి స్థితిలో అతను పడుకొని నమాజు ఆచరించాల్సి ఉంటుంది’ అని భోదించారు.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ టాగలాగ్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية الدرية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. రోగి యొక్క ఫర్జ్ నమాజుల ఆచరణలో క్రమపద్దతిని పాటించడం అనివార్యము,అతనికి శక్తి కల్గినట్లైతే నిలబడి ఖియామ్ ఆచరించడం తప్పనిసరి ఎందుకంటే అది ఫర్జ్ నమాజు యొక్క మూలంశాలలో ఒకటి,అది కర్ర సహాయం తో ఆధారాన్ని ఏర్పర్చుకోవడం లేదా దానిపై ఒరగడం లేదా గోడను ఆధారంగా చేసుకోవడం లాంటి విధానం.
  2. ఒకవేళ నిలబడి ఖియామ్ చేయగలిగే శక్తి లేనట్లైతే లేదా క్లిష్టంగా ఉన్నప్పుడు అతను కూర్చుని ఆచరించవచ్చు అది ఒకవేళ ఏదైనా ఆధారంగా చేసుకుని లేదా ఇతర వస్తువు పై ఒరిగి అయిన కావచ్చు,రుకూ మరియు సజ్దా అతని శక్తిమేరకు ఆచరించాలి,ఒకవేళ అతనికి కూర్చుని ఆచరించే శక్తి లేని పక్షంలో లేక అది క్లిష్టమైనప్పుడు అతను ఒకవైపుకు పడుకుని నమాజు ఆచరించవచ్చు,కుడివైపుకు పడుకుని చేయడం ఎంతో ఉత్తమం,ఒకవేళ అతను ఖిబ్లా వైపుకు తిరిగి పడుకుంటె అది సరిఅవుతుంది,ఒకవేళ అలా చేయగలిగే శక్తి అతనికి లేకుంటే తల తో సైగలు చేస్తూ చదువుకోవచ్చు,మరియు అతని సజ్దా కొరకు చేసే సైగలు రుకూ కొరకు చేసే సైగ కంటే కాస్తా క్రిందికి ఉండాలి,ఆ రెండింటి మధ్య భేదం ఏర్పర్చడానికి,ఎందుకంటే సజ్దాలు రుకూ కంటే దిగువ ఉంటాయి.
  3. ఒక స్థితి నుండి మరో స్థితికి బలహీన స్థితిలో లేక మొదటి స్థితి క్లిష్ట మైనప్పుడు లేక ఖియామ్ నిలబడటం కష్టమైనప్పుడు మారవచ్చు,ఎందుకంటే ఒక స్థితి నుండి మరో స్థితికి మారాలి అంటే శక్తిలేకపోవడం అనే నిబంధన పెట్టబడియుంది.
  4. క్లిష్టమైనస్థితి’అనే నిబంధన ఫర్జ్ నమాజును కూర్చుని చదవడానికి అనుమతిస్తుంది,ఎందుకంటే ఆ బాధవల్ల నమాజులో ఏకాగ్రత నశిస్తుంది,ఏకాగ్రత అనేది నమాజు యొక్క ఉద్దేశ్యాలలో అత్యంత పెద్ద ఉద్దేశం.
  5. ఫర్జ నమాజులను కూర్చుని చదవడానికి షరీఅతు పరమైన సాకులు అనేకం ఉన్నాయి,ఇది కేవలం రోగగ్రస్తులకు మాత్రమే ప్రత్యేకము కాదు,బయటకు రాలేని చిన్న పైకప్పులో,పడవలో లేదా ఓడలో,లేదా కారులో, లేదా విమానంలో నమాజు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు నిలబడి ఖియామ్ చేసే శక్తిలేకపోవడం వంటివి ఇవన్నీకూర్చుని నమాజు చేయడానికి అనుమతించే సాకులు.
  6. మతిస్థిమితం స్థిరంగా ఉన్నంత కాలము నమాజు ఖచ్చితంగా స్థాపించాల్సిఉంది,రోగ గ్రస్తుడు ఒకవేళ తల సైగలతో నమాజు చేయలేని స్థితిలో ఉన్నప్పుడూ అతను కంటి సైగలతో నమాజు ఆచరించాలి,రుకు కొరకు క్రిందికి చూడాలి అయితే సజ్దా చేసేటప్పుడు రుకూ కంటే ఇంకా దిగువకు చూడాల్సి ఉంటుంది ,అతనికి నోటితో ఖిరాత్ చేసే శక్తి ఉన్నట్లైతే పఠించాలి,లేకపోతే మనసులోనే చదువుకోవాలి,ఒకవేళ అతనికి సైగలతో నమాజు ఆచరించే శక్తి కూడా లేకపోతే అప్పుడు అతను మనసులో నమాజు చదువుకోవాలి.
  7. ఈ హదీసు సాధాారణంగా ఒక వ్యక్తి తనకు నచ్చిన ప్రకారం కూర్చుని నమాజు ఆచరించవచ్చు అనే విషయాన్ని నిర్దారిస్తుంది,ఇది ‘ఇజ్మా’గా పెర్కునబడినది,జమ్హూర్ ఉలమాల ఇజ్మా ప్రకారంగా అతను ఖియామ్ చేయు ప్రదేశం లో కూర్చుని నమాజు ఆచరించాలి,రుకూ నుంచి మరియు సజ్దా నుండి లేచే చోట పడుకుని నమాజు ఆచరించాలి
  8. మహోన్నతుడైన అల్లాహ్ యొక్క ఆదేశాలను మనిషి తన సామర్ధ్యం మరియు శక్తిల మేరకు ఆచరించాల్సి ఉంది,అల్లాహ్ ఏ ప్రాణి పై కూడా దానిశక్తికి మించిన భారాన్ని మోపడు”
  9. ఈ ఇస్లామిక్ చట్టంకు గల యొక్క సులభం మరియు సౌలభ్యం గురించి తెలుస్తుంది,మహోన్నతుడైన అల్లాహ్ ఈ విషయం గురించి ఇలా తెలియజేశాడు : {وَمَا جَعَلَ عَلَيْكُمْ فِي الدِّينِ مِنْ حَرَجٍ} [الحج:78], {يُرِيدُ اللَّهُ أَنْ يُخَفِّفَ عَنْكُمْ} [النساء]، సర్వశక్తిమంతుడైన అల్లాహ్ తన తన దాసుల పై విస్తృతంగా దయకారుణ్యాలను చూపిస్తాడు.
  10. మొదట ప్రస్తావించబడినది ఫర్ద్ నమాజుల ఆదేశం,ఇక నఫిల్ నమాజులు కూర్చుని చదవవచ్చు ఎలాంటి సాకు లేకున్నా సరిఅవుతుంది,కానీ ఒకవేళ సాకుతో అలా చదివితే పూర్తి పుణ్యం ప్రాప్తిస్తుంది, ఎలాంటి సాకు లేకుండా కూర్చుని చదివితే నిలబడి చదివే పుణ్యంలో సగం లభిస్తుంది,ఈ విషయం సున్నతు ద్వారా రూఢీ అవుతుంది.
ఇంకా