عن أبي سعيد الخدري رضي الله عنه أن رسول الله -صلى الله وعليه وسلم- قال: «لا ضَرَرَ ولا ضِرَارَ».
[صحيح] - [رواه ابن ماجه من حديث أبي سعيد الخدري -رضي الله عنه- ومن حديث عبادة بن الصامت -رضي الله عنه-. ورواه أحمد من حديث عبادة بن الصامت -رضي الله عنه-. ورواه مالك من حديث عمرو بن يحي المازني مرسلا]
المزيــد ...

అబూసయీద్ అల్ ఖుద్రి రజియల్లాహు అన్హు ఉల్లేఖనం’నిశ్చయంగా మహనీయ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ప్రభోధించారు ‘కీడు తలపెట్టకండి కీడుకు గురికాకండి.
దృఢమైనది - దాన్ని ఇబ్నె మాజ ఉల్లేఖించారు

వివరణ

షరీయతుశాసనాలు,నైతికవిలువలు మరియు పరస్పర వ్యవహరాలకు సంబంధిత ఇస్లామియ సూత్రాలను ఈ హదీస్ కలిగి ఉంది,అంటే ఎవరికీ ఏ రకంగాను,ఏ విధంగానైనా హానిచేయకూడదు,ఎందుకంటే ఒకరికి హాని కలిగించడం హరాము,మరియు హానిని తొలగించడం తప్పనిసరి,అలాగే హాని ద్వారా హాని తొలగించబడదు,మరియు హాని కల్గించటం హరాము.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ టాగలాగ్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية الدرية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ కు ‘జవామివుల్ కలిమ్’{అర్ధవంతమైన వివేకపు వాక్యాలు}నొసగబడ్డాయి దీనికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి,ఇది మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ప్రత్యేకతల్లో ఒకటి.
  2. నష్టం తొలగించబడుతుంది.
  3. ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో ప్రతీకారం తీర్చుకోవడం నిషేధించబడినది
  4. అల్లాహ్ తన దాసులకు నష్టాన్ని చేకూర్చే ఏ ఆదేశం ఇవ్వలేదు
  5. ‘ఖండించబడటం’అనే పదం‘ నిషేదం’ అర్ధంలో పేర్కొనబడుతుంది.
  6. హనీ కల్గించడం అది మాటవల్ల లేదా కార్యంలో లేదా త్యజించడం వల్ల ఎట్టి పరిస్థితుల్లో నిషేదమే!
  7. ఇస్లాం ధర్మం శాంతి ధర్మం.
  8. ఈ హదీసు ఇస్లాం షరీయతు కు చెందిన సూత్రాలలో ఒకటిగా పరిగణించబడుతున్నది,ఆ సూత్రం ‘ఇస్లాం షరీయతు హనీని అనుమతించదు మరియు హనీ చేయడాన్ని ఖండిస్తుంది.
  9. అద్దరరు{الضرر} మరియు ‘వద్దిరారు’{الضرار} మధ్య వ్యత్యాసం ఉన్నదా లేదా ?. వారిలో కొందరు ఇలా అన్నారు:అవి ఖచ్చితంగా ఒక అర్ధం,కానీ వాటి మధ్య వ్యత్యాసం ఉన్నదనే విషయం ప్రసిద్ది,పిదప ఇలా చెప్పబడింది:అద్దరరు{الضرر} నామవాచకం, మరియు{الضرار}దిరార్’అనేది క్రియ,అర్ధం ఏమిటంటే –‘దరర్’ షరీయతులో స్వయంగా నష్టపోవడం,మరియు ఏ హక్కు లేకుండా హానీ కలిగించడం,కొంతమంది చెప్పారు : అద్దిరర్ : అంటే దానిద్వారా ప్రయోజనం పొందడానికి ఇతరులకు నష్టపరచడం,అద్దిరార్: అంటే దానిద్వారా ఎలాంటి ప్రయోజనం లేకుండానే ఇతరులను నష్టపరచడం{ كمن منع ما لا يضره ويتضرر به الممنوع } ఈ మాటను కొంతమంది ఏకీభవిస్తూ దృవీకరించారు,అందులో అబ్దుల్ బర్ర్,ఇబ్ను సలాహ్ కూడా ఉన్నారు,మరికొంతమంది అన్నప్రకారం : అద్దరరు{الضرر} హనీ కలిగించని వ్యక్తి కి హనీ కలిగించడం,మరియు ‘వద్దిరారు’{الضرار}అంటే తనకు హాని చేసిన వారికి చెడు మార్గంలో హాని కలిగించడం,ఏది ఏమైనప్పటికి మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ‘అన్యాయమైన అద్దరరు{الضرر}‘వద్దిరారు’{الضرار} రెండిటినీ ఖండించారు.