عَنِ ابْنِ عَبَّاسٍ رضي الله عنهما قَالَ:
قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ لِامْرَأَةٍ مِنَ الْأَنْصَارِ سَمَّاهَا ابْنُ عَبَّاسٍ فَنَسِيتُ اسْمَهَا: «مَا مَنَعَكِ أَنْ تَحُجِّي مَعَنَا؟» قَالَتْ: لَمْ يَكُنْ لَنَا إِلَّا نَاضِحَانِ فَحَجَّ أَبُو وَلَدِهَا وَابْنُهَا عَلَى نَاضِحٍ وَتَرَكَ لَنَا نَاضِحًا نَنْضِحُ عَلَيْهِ، قَالَ: «فَإِذَا جَاءَ رَمَضَانُ فَاعْتَمِرِي، فَإِنَّ عُمْرَةً فِيهِ تَعْدِلُ حَجَّةً».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 1256]
المزيــد ...
అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం :
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్సారీలలో ఒక స్త్రీని ఇలా ప్రశ్నించారు; ఇబ్న్ అబ్బాస్ ఆ స్త్రీ పేరు ఏమిటో చెప్పారు, కానీ నేను మర్చిపోయాను; “మాతో పాటు హజ్ చేయుట నుండి నిన్ను ఏ విషయం నిరోధించినది?” ఆమె ఇలా అన్నది “మా వద్ద ఒంటెలు రెండు తప్ప (ఎక్కువ) మరొకటి లేదు. ఒక ఒంటెపై నా భర్త మరియు ఆయన కుమారుడు హజ్జ్ చేయుటకు వెళ్ళారు, ఒక ఒంటెను వదిలి వెళ్ళారు, దానిపై నీళ్ళు తెచ్చుకొనుటకు గాను”, అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెతో “రమజాన్ మాసం వచ్చినపుడు ఉమ్రా చేయి. ఎందుకంటే ఆ మాసములో చేయు ఉమ్రా (పుణ్యఫలములో) హజ్జ్ తో సమానము” అన్నారు.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 1256]
‘హజ్జతుల్ విదా’ (వీడ్కోలు హజ్జ్) నుండి తిరిగి వచ్చిన తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం; హజ్జ్ చేయని ఒక అన్సారీ స్త్రీని ఇలా అడిగారు: “మాతో పాటు హజ్జ్ చేయుట నుండి నిన్ను ఏ విషయం నిరోధించినది?”
ఆమె క్షమించమని కోరి తమ వద్ద రెండు ఒంటెలు మాత్రమే ఉన్నాయని, తన భర్త మరియు ఆయన కుమారుడు ఆ రెంటిలో ఒకదానిపై హజ్జ్ చేసారు. మరొక దానిని బావి నుండి నీళ్ళు తోడడానికి వదిలి వెళ్ళారు అని చెప్పింది.
అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – రమజాన్ మాసములో ఉమ్రా చేయుట పుణ్యఫలములో హజ్జ్ చేయుటకు సమానము అని ఆమెకు తెలియజేసారు.