عن أبي هريرة رضي الله عنه قال: سمعت النبي صلى الله عليه وسلم يقول:
«مَنْ حَجَّ لِلهِ فَلَمْ يَرْفُثْ وَلَمْ يَفْسُقْ رَجَعَ كَيَوْمِ وَلَدَتْهُ أُمُّهُ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1521]
المزيــد ...
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకుతూ ఉండగా నేను విన్నాను:
ఎవరైతే కేవలం అల్లాహ్ కొరకు హజ్ చేస్తారో, అందులో (తన భార్యతో) లైంగిక చర్యలకు మరియు అశ్లీల సంభాషణలకు, చెడు పనులకు పాల్బడడో – అతడు తన తల్లి తనకు జన్మనిచ్చిన దినము వలే తిరిగి వస్తాడు.
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 1521]
ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏమని వివరిస్తున్నారూ అంటే “ఎవరైతే కేవలం సర్వోన్నతుడైన అల్లాహ్ కొరకు మాత్రమే హజ్ చేస్తాడో మరియు అశ్లీలతలకు పాల్బడడో." అన్నారు – ఇక్కడ అశ్లీలత అంటే సంభోగములో పాల్గొనుట మరియు దానికి దారితీసే ప్రతి చర్యా అని అర్థము. ఉదాహరణకు (కాంక్షతో) ముద్దు పెట్టుకొనుట, కౌగలించుకొనుట, ప్రేరేపించుట మొదలైనవి. అదే విధంగా అశ్లీల సంభాషణలు, అసభ్యకరమైన పనులు, చెడుపనులకు పాల్బడుట మొదలైనవి. అసభ్యకరమైన పనులలో, చెడు పనులలో ఇహ్రాంను భంగపరిచే పనులు కూడా వస్తాయి. ఎవరైతే పైన తెలిపిన వాటికి దూరంగా ఉంటాడో, అతడు పాపాల నుండి పూర్తిగా క్షమించబడి, అపుడే జన్మించిన శిశువు మాదిరిగా (పవిత్రంగా) తన హజ్ నుండి తిరిగి వస్తాడు.