عَنِ ابْنِ عَبَّاسٍ رضي الله عنهما قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«لَا يَنْظُرُ اللهُ إِلَى رَجُلٍ أَتَى رَجُلًا أَوِ امْرَأَةً فِي دُبُرٍ».
[صحيح] - [رواه الترمذي والنسائي في الكبرى] - [السنن الكبرى للنسائي: 8952]
المزيــد ...
ఇబ్న్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“పురుషునితో గానీ, లేక స్త్రీతో గానీ మలద్వారము ద్వారా సంభోగములో పాల్గొనే వాని వైపునకు అల్లాహ్ (తీర్పు దినమున) కన్నెత్తి కూడా చూడడు.”
[ప్రామాణికమైన హదీథు] - [అత్తిర్మిదీ మరియు సునన్ అన్నసాయీ కుబరాలో నమోదు చేసినారు:] - [సునన్ అల్ కుబ్రా అన్నసాయీ - 8952]
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పురుషుడిని లేదా స్త్రీని మలద్వారము ద్వారా సంభోగించే వ్యక్తికి కలిగే తీవ్రమైన పరిణామాలను స్పష్టం చేశారు. ఎందుకంటే (తీర్పుదినమున) అల్లాహ్ అతనిపై తన అనుగ్రహం, దయ, కనికరం చూపడు. మరియు అది ఘోరమైన పాపాలలో (కబాయిర్’లలో) ఒకటి అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఎత్తి చూపారు.