عَنْ أَبِي بُرْدَةَ الْأَنْصَارِيِّ رَضيَ اللهُ عنهُ أَنَّهُ سَمِعَ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«لَا يُجْلَدُ أَحَدٌ فَوْقَ عَشَرَةِ أَسْوَاطٍ إِلَّا فِي حَدٍّ مِنْ حُدُودِ اللهِ».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 1708]
المزيــد ...
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకుతూ ఉండగా తాను విన్నానని అబూ బుర్దహ్ అల్ అన్సారీ రదియల్లాహు అన్హు ఉల్లేఖించినారు:
"అల్లాహ్ నిర్దేశించిన హుదూద్ మహాశిక్షలను మినహాయించి, ఎవరికీ పది కొరడా దెబ్బల కంటే ఎక్కువ కొరడా దెబ్బల శిక్ష విధించకూడదు"
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 1708]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పది కొరడా దెబ్బలకు మించి ఎవరినీ కొరడా దెబ్బలు కొట్టకూడదని నిషేధించారు. అయితే, ఈ నిషేధం, పెద్ద పాపాలకు నిర్దేశించబడిన హుదూద్ మహాశిక్షలకు వర్తించదు. ఇక్కడ ఉద్దేశ్యం ఏమిటంటే, శిక్షార్థంగా కొట్టడం, ఉదాహరణకు భార్య లేదా బిడ్డను కొరడాతో కొట్టడం, అది పది కొరడా దెబ్బలకు మించకూడదు.