కూర్పు:
+ -

عَنْ أَبِي ثَعْلَبَةَ الخُشَنِيِّ جُرْثُومِ بن نَاشِرٍ رَضِيَ اللَّهُ عَنْهُ عَنْ رَسُولِ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَال:
«إِنَّ اللَّهَ فَرَضَ فَرَائِضَ فَلَا تُضَيِّعُوهَا، وَحَدَّ حُدُودًا فَلَا تَعْتَدُوهَا، وَحَرَّمَ أَشْيَاءَ فَلَا تَنْتَهِكُوهَا، وَسَكَتَ عَنْ أَشْيَاءَ رَحْمَةً لَكُمْ غَيْرَ نِسْيَانٍ فَلَا تَبْحَثُوا عَنْهَا».

[قال النووي: حديث حسن] - [رواه الدارقطني في سننه، وغيره] - [الأربعون النووية: 30]
المزيــد ...

అబూ సఅ'లబా అల్-ఖుషనియ్యి జర్'సూమి ఇబ్నె నాషిర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"నిశ్చయంగా, అల్లాహ్ కొన్ని బాధ్యతలను విధించాడు, కాబట్టి వాటిని వృధా చేయకండి. మరియు కొన్ని హద్దులు (నిబంధనలు) నిర్దేశించాడు, కాబట్టి వాటిని అతిక్రమించకండి. మరియు కొన్నింటిని నిషేధించాడు, కాబట్టి వాటిని ఉల్లంఘించకండి. మరియు మీపై దయ వలన, మరికొన్నింటి గురించి మౌనం దాల్చాడు; (అది) ఆయన మరచిపోవడంవల్ల కాదు, కాబట్టి మీరు వాటిని పరిశోధించకండి."

[قال النووي: حديث حسن] - [رواه الدارقطني في سننه وغيره] - [الأربعون النووية - 30]

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా అన్నారు, అల్లాహ్ కొన్నింటిని తప్పనిసరి చేసాడు మరియు విధిగావించాడు, కాబట్టి వాటికి కట్టుబడి ఉండండి మరియు వాటిని వదిలివేయడం ద్వారా లేదా వాటిని పట్టించుకోక పోవడం ద్వారా వాటిని నిర్లక్ష్యం చేయవద్దు. ఆయన మీ కోసం అడ్డంకులు మరియు ఆటంకాలను ఏర్పాటు చేశాడు, అవి మిమ్మల్ని నిరోధించి, ఆయన ఇష్టపడని వాటిని మీరు ఆచరించకుండా మిమ్మల్ని నిరోధిస్తాయి, కాబట్టి షరియా ఆదేశించిన నిషేధాజ్ఞలను అతిక్రమించవద్దు. ఆయన కొన్నింటిని నిషేధించాడు, కాబట్టి వాటిలో పాల్గొనవద్దు లేదా వాటి దగ్గరికి వెళ్లవద్దు, వాటిని ఉల్లంఘించవద్దు. వాటిని కాకుండా, ఆయన తన సేవకుల పట్ల దయతో మిగతా వాటి గురించి మౌనంగా ఉన్నాడు, కాబట్టి అవి వాటి అసలు స్థితిలోనే అనుమతించబడతాయి, అందువలన వాటి కోసం వెతకవద్దు.

من فوائد الحديث

  1. అల్లాహ్ యే ధర్మశాసనకర్త అని ఈ హదీథు రుజువు చేస్తున్నది, కాబట్టి ప్రతివిషయం ఆయన చేతుల్లోనే ఉంటుంది, ఆయన సర్వలోపాలకు అతీతుడు, పరమ పవిత్రుడు.
  2. ఈ హదీథ్‌లో షరీయత్ నియమాల యొక్క మూల సూత్రాలు – హుక్ము (తీర్పు) మరియు ఇబాహా (అనుమతి) – వివరించబడ్డాయి. ఎందుకంటే షరియత్ తీర్పు (హుక్మ్ షర‘య్) రెండు విధాలుగా ఉంటుంది: అది ఏదైనా విషయం గురించి మౌనంగా ఉండడం లేదా దాని గురించి స్పష్టంగా మాట్లాడడం. అది ఇలా ఉంటుంది: తప్పక చేయవలసిందిగా నిర్దేశించబడిన (వాజిబ్) ఆచరణలు లేదా వీలైనంత ఎక్కువగా చేయమని ప్రోత్సహించబడిన (సున్నతు) ఆచరణలు ; లేదా పూర్తిగా నిషేధించబడిన (హరామ్) ఆచరణలు లేదా అయిష్టకరమైనవిగా, అసహ్యకరమైనవిగా తెలుపబడిన (మక్రూహ్) ఆచరణలు ; లేదా అనుమతించబడి (ముబాహ్) ఆచరణలు ."
  3. అల్లాహ్ దేని గురించి అయితే మౌనంగా ఉన్నాడో, దానినీ తప్పనిసరిగా చేయని విధిగావించలేదు, పరిమితం చేయలేదు లేదా నిషేధించలేదు - అది అనుమతించబడింది.
  4. ప్రవక్త ﷺ యొక్క అద్భుతమైన వాక్చాతుర్యం కారణంగా, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీథ్‌ను ఇంత స్పష్టమైన పదాలతో మరియు స్పష్టతతో కూడిన వర్గీకరణతో వివరించారు.
  5. మహోన్నతుడైన అల్లాహ్ విధించిన వాజిబులను కాపాడుకోవడం తప్పనిసరి.
  6. మహోన్నతుడైన అల్లాహ్ విధించిన హద్దులను అతిక్రమించడం నిషేధించబడింది.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ ఇండోనేషియన్ బెంగాలీ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం థాయ్ జర్మన్ పష్టో అస్సామీ అల్బేనియన్ الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية الليتوانية الدرية الصربية الطاجيكية Кинёрвондӣ المجرية التشيكية الموري Малагашӣ Канада الولوف Озарӣ الأوزبكية الأوكرانية الجورجية المقدونية الخميرية
అనువాదాలను వీక్షించండి
కూర్పులు
ఇంకా