عَنْ أَمِيرِ المُؤْمِنِينَ أَبِي حَفْصٍ عُمَرَ بْنِ الخَطَّابِ رضي الله عنه قَالَ: سَمِعْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«إنَّمَا الأَعْمَالُ بِالنِّيَّاتِ، وَإِنَّمَا لِكُلِّ امْرِئٍ مَا نَوَى، فَمَنْ كَانَتْ هِجْرَتُهُ إلَى اللَّهِ وَرَسُولِهِ فَهِجْرَتُهُ إلَى اللَّهِ وَرَسُولِهِ، وَمَنْ كَانَتْ هِجْرَتُهُ لِدُنْيَا يُصِيبُهَا أَوْ امْرَأَةٍ يَنْكِحُهَا فَهِجْرَتُهُ إلَى مَا هَاجَرَ إلَيْهِ».
[صحيح] - [رواه إماما المحدثين أبو عبد الله محمد بن إسماعيل بن إبراهيم بن المغيرة بن بردزبه البخاري، وأبو الحسين مسلم بن الحجاج بن مسلم القشيري النيسابوري في صحيحيهما اللذين هما أصح الكتب المصنفة] - [الأربعون النووية: 1]
المزيــد ...
అమీరుల్ మూమినీన్ (విశ్వాసుల నాయకుడు) అబూ హఫ్స్ ఉమర్ ఇబ్నుల్-ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను:
"నిశ్చయంగా, ఆచరణలన్నీ (కర్మలన్నీ, పనుల్నీ) సంకల్పాలపైనే (నియ్యతులపైనే) ఆధారపడి ఉంటాయి, మరియు నిశ్చయంగా ప్రతి ఒక్కరికీ వారు సంకల్పించినదే లభిస్తుంది. కాబట్టి, ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కోసం హిజ్రత్ (వలస) చేస్తారో, వారి హిజ్రత్ (వలస) అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కొరకే అవుతుంది (దానికి తగిన ప్రతిఫలం వారికి లభిస్తుంది). మరియు ఎవరైతే ఏదైనా ప్రాపంచిక లాభం పొందడానికో లేదా ఎవరైనా స్త్రీని పెళ్లి చేసుకోవడానికో హిజ్రత్ (వలస) చేస్తారో, అది వారు హిజ్రత్ (వలస) చేసిన దాని కొరకే అవుతుంది."
[దృఢమైనది] - [رواه إماما المحدثين أبو عبد الله محمد بن إسماعيل بن إبراهيم بن المغيرة بن بردزبه البخاري وأبو الحسين مسلم بن الحجاج بن مسلم القشيري النيسابوري في صحيحيهما اللذين هما أصح الكتب المصنفة] - [الأربعون النووية - 1]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు – ఆచరణలు అన్నీ వాటి వెనుక ఉండే సంకల్పాలపై ఆధారపడి ఉంటాయి. ఈ నియమం సాధారణంగా ఆచరణలు అన్నింటికీ వర్తిస్తుంది – అవి ఆరాధనలకు సంబంధించిన ఆచరణలు గానీ లేక సాధారణ వ్యవహారాలకు సంబంధించిన ఆచరణలు గానీ. కనుక ఎవరైనా తాను చేసే పని ద్వారా ఏదైనా ప్రయోజనం లేదా లాభం పొందాలని సంకల్పించి ఉంటే, అతనికి ఆ ప్రయోజనం తప్ప పుణ్యఫలం ఏమీ లభించదు. అలాగే ఎవరైనా తాను చేసే పని కేవలం సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క సామీప్యం పొందే, ఆయన కరుణ పొందే సంకల్పము తో చేసి ఉంటే, అతనికి దాని ప్రతిఫలం మరియు పుణ్యఫలం లభిస్తాయి, అది తినడం లేక తాగడం లాంటి సాధారణ ఆచరణ అయినా సరే.
ఆచరణలలో ‘సంకల్పము’ యొక్క ప్రాధాన్యత మరియు దాని ప్రభావాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ఉదాహరణ ద్వారా విశదీకరిస్తున్నారు. ఇద్దరు వ్యక్తుల ‘హిజ్రత్’ (తన స్వస్థలాన్ని వదిలి శాస్వతంగా వేరే కొత్త ప్రదేశానికి వలస వెళ్ళుట) బాహ్యంగా చూడడానికి ఒకేలా కనిపించినా – ఎవరైతే కేవలం తన ప్రభువైన అల్లాహ్ యొక్క సంతుష్ఠి కొరకు, ఆయన సామీప్యం మరియు కరుణ పొందుటకు వలస వెళ్ళిపోవాలని సంకల్పిస్తాడో, అది షరియత్’కు అనుగుణంగా చేయబడిన ‘హిజ్రత్’ (వలస) గా స్వీకరించబడుతుంది. అతని సంకల్పములోని స్వచ్ఛత కారణంగా అతడికి పుణ్యఫలం లభిస్తుంది. అలాగే, ఎవరైతే తాను చేసే హిజ్రత్ (వలస వెళ్ళిపోవుట) ద్వారా ఏదైనా ప్రాపంచిక ప్రయోజనం పొందుట సంకల్పించి ఉంటే, అంటే ఉదాహరణకు ధనం సంపాదించుట కొరకు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుట కొరకు, లేదా వ్యాపారం కొరకు, లేదా ఆ ప్రదేశపు స్త్రీని వివామాడుట కొరకు సంకల్పించి ఉంటే, అతడికి అతడు ఆశించిన ప్రయోజనం తప్ప మరేమీ లబించదు. హిజ్రత్ పుణ్యఫలంలో అతడికి ఏమాత్రమూ భాగం ఉండదు.