عَن هَانِئ مَوْلَى عُثْمَانَ رَضيَ اللهُ عنهُ قَالَ: كَانَ عُثْمَانُ إِذَا وَقَفَ عَلَى قَبْرٍ بَكَى حَتَّى يَبُلَّ لِحْيَتَهُ، فَقِيلَ لَهُ: تُذْكَرُ الْجَنَّةُ وَالنَّارُ فَلَا تَبْكِي، وَتَبْكِي مِنْ هَذَا؟ فَقَالَ: إِنَّ رَسُولَ اللهِ صلى الله عليه وسلم قَالَ:
«إِنَّ الْقَبْرَ أَوَّلُ مَنْزِلٍ مِنْ مَنَازِلِ الْآخِرَةِ، فَإِنْ نَجَا مِنْهُ فَمَا بَعْدَهُ أَيْسَرُ مِنْهُ، وَإِنْ لَمْ يَنْجُ مِنْهُ فَمَا بَعْدَهُ أَشَدُّ مِنْهُ».
[حسن] - [رواه الترمذي وابن ماجه] - [سنن الترمذي: 2308]
المزيــد ...
అల్లాహ్ పట్ల ఉథ్మాన్ రదియల్లాహు అన్హు భయభక్తుల గురించి
హానీ మౌలా ఉథ్మాన్ రదియల్లాహు అన్హు నుండి ఉల్లేఖన: "ఉథ్మాన్ రదియల్లాహు అన్హు ఒక సమాధి దగ్గర నిలబడి, ఎంత ఎక్కువగా ఏడ్చినారంటే, (కన్నీళ్ళకు) ఆయన గడ్డం కూడా తడిసిపోయింది. అది చూసి వారిని ఇలా అడిగినారు: 'మీరు స్వర్గం, నరకం గురించి విన్నప్పుడు అంతగా ఏడవరు, కాని సమాధిని చూసి మాత్రం ఏడుస్తున్నారు?' దానికి ఉథ్మాన్ రదియల్లాహు అన్హు ఇలా చెప్పారు: 'ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికి ఉన్నారు:
"నిశ్చయంగా సమాధి పరలోక ప్రయాణంలోని మెట్టు. ఇక్కడ (అల్లాహ్ శిక్ష నుండి) రక్షించబడితే, తర్వాతి దశలు సులభంగా ఉంటాయి. ఇక్కడ రక్షించబడకపోతే, తర్వాతి దశలు చాలా కఠినంగా ఉంటాయి."
[ప్రామాణికమైనది] - - [سنن الترمذي - 2308]
అమీరుల్ ముమినీన్ ఉథ్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు అన్హు ఒకవేళ సమాధి దగ్గర ఆగినట్లయితే, ఆయన ఎంతో ఏడ్చేవారు. కన్నీళ్లు అంత ఎక్కువగా కారడం వలన ఆయన గడ్డ కూడా తడిసిపోయేది. దానికి అక్కడి వారిలో కొందరు ఆయనను ఇలా అడిగారు: "మీరు స్వర్గం గురించి లేదా నరకం గురించి విన్నప్పుడు, (స్వర్గశుభాల సంతోషంతో) ఆనంద భాష్పాలు రాల్చడమో, లేదా నరక భయంతో ఏడవడమో చేయరు! కానీ సమాధిని చూసి మాత్రం ఏడుస్తున్నారు?" అవుడు ఉథ్మాన్ రదియల్లాహు అన్హు సమాధి గురించి ఇలా చెప్పినారు: "ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: 'సమాధి పరలోక ప్రయాణంలో మొదటి మెట్టు. ఇక్కడ (అల్లాహ్ శిక్ష నుండి) రక్షించబడితే, తర్వాతి దశలు సులభంగా ఉంటాయి. ఇక్కడ రక్షించబడకపోతే, తర్వాతి దశల్లో వచ్చే శిక్షలు మరింత కఠినంగా ఉంటాయి.'"