عن أبي سعيد الخدري رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم:
«الحَسَن والحُسَيْن سَيِّدا شَباب أهْل الجنة».
[صحيح] - [رواه الترمذي وأحمد] - [سنن الترمذي: 3768]
المزيــد ...
అబూ సయీద్ అల్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“అల్ హసన్ మరియు అల్ హుసేన్ (రదియల్లాహు అన్హుమా) ఇద్దరూ స్వర్గములో యువకుల నాయకులు”.
[దృఢమైనది] - - [سنن الترمذي - 3768]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీథులో అలీ బిన్ అబీ తాలిబ్ మరియు తన కుమార్తె ఫాతిమా (రదియల్లాహు అన్హుమ్)ల సంతానమైన అల్ హసన్ మరియు అల్ హుసేన్ (రదియల్లాహు అన్హుమా)లు, ఎవరైతే ఈ ప్రపంచములో యవ్వనంలో చనిపోయి అల్లాహ్ అనుగ్రహముతో స్వర్గములో ప్రవేశిస్తారో వారందరికీ నాయకులుగా ఉంటారు అని అన్నారు. లేక దీని అర్థము వారిద్దరూ స్వర్గములో యువకులందరికీ నాయకులుగా ఉంటారు అని కూడా కావచ్చు; అయితే ప్రవక్తలు, సందేశహరులు మరియు ఖులఫా అర్’రాషిదీన్ లకు తప్ప.