عَنْ عَبْدِ اللَّهِ بْنِ عُمَرَ رَضِيَ اللَّهُ عَنْهُمَا: أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«إِنَّ أَحَدَكُمْ إِذَا مَاتَ عُرِضَ عَلَيْهِ مَقْعَدُهُ بِالْغَدَاةِ وَالعَشِيِّ، إِنْ كَانَ مِنْ أَهْلِ الجَنَّةِ فَمِنْ أَهْلِ الجَنَّةِ، وَإِنْ كَانَ مِنْ أَهْلِ النَّارِ فَمِنْ أَهْلِ النَّارِ، فَيُقَالُ: هَذَا مَقْعَدُكَ حَتَّى يَبْعَثَكَ اللَّهُ يَوْمَ القِيَامَةِ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1379]
المزيــد ...
అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు:
"నిశ్చయంగా, మీలో ఒకరు మరణించినప్పుడు, అతనికి ఉదయం మరియు సాయంత్రం అతని స్థానం చూపబడుతుంది. అతను స్వర్గవాసులలో ఉంటే, అతనికి స్వర్గంలో అతని స్థానం చూపబడుతుంది, మరియు అతను నరకవాసులలో ఉంటే, అతనికి నరకంలో అతని స్థానం చూపబడుతుంది. అతనితో ఇలా అనబడుతుంది: అల్లాహ్ తీర్పు రోజున మిమ్మల్ని పునరుత్థానం చేసే వరకు ఇది మీ స్థానం."
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 1379]
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: ఒక దాసుడు మరణించినప్పుడు, రోజు ప్రారంభంలో మరియు చివరిలో అతని నివాస స్థలం మరియు స్వర్గం లేదా నరకంలో అతని నిర్దిష్ట స్థానం అతనికి చూపబడుతుంది - అతను స్వర్గవాసులలో ఉంటే స్వర్గంలో అతని స్థానం, మరియు అతను నరకవాసులలో ఉంటే నరకంలో అతని స్థానం. మరియు అతనికి ఇలా చెప్పబడుతుంది: పునరుత్థాన దినాన మీరు తిరిగి లేపబడే మీ స్థానం ఇదే. ఇది విశ్వాసికి సంత్వనము, సౌఖ్యము నిస్తుంది మరియు అవిశ్వాసికి శిక్షగా ఉంటుంది.