+ -

عن تَميم الداري رضي الله عنه، قال: سمعتُ رسول الله صلى الله عليه وسلم يقول:
«‌لَيَبْلُغَنَّ ‌هَذَا الأَمْرُ مَا بَلَغَ اللَّيْلُ وَالنَّهَارُ، وَلَا يَتْرُكُ اللهُ بَيْتَ مَدَرٍ وَلَا وَبَرٍ إِلَّا أَدْخَلَهُ اللهُ هَذَا الدِّينَ، بِعِزِّ عَزِيزٍ أَوْ بِذُلِّ ذَلِيلٍ، عِزًّا يُعِزُّ اللهُ بِهِ الإِسْلَامَ، وَذُلًّا يُذِلُّ اللهُ بِهِ الكُفْرَ» وَكَانَ تَمِيمٌ الدَّارِيُّ يَقُولُ: قَدْ عَرَفْتُ ذَلِكَ فِي أَهْلِ بَيْتِي، لَقَدْ أَصَابَ مَنْ أَسْلَمَ مِنْهُمُ الْخَيْرُ وَالشَّرَفُ وَالْعِزُّ، وَلَقَدْ أَصَابَ مَنْ كَانَ مِنْهُمْ كَافِرًا الذُّلُّ وَالصَّغَارُ وَالْجِزْيَةُ.

[صحيح] - [رواه أحمد] - [مسند أحمد: 16957]
المزيــد ...

తమీమ్ అద్దారీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకుతుండగా నేను విన్నాను:
“రాత్రింబవళ్ళు ఎక్కడెక్కడి వరకు చేరుకుంటాయో అక్కడి వరకు నిశ్చయంగా ఈ విషయం (ఇస్లాం) చేరుకుంటుంది. అది పల్లె గానీ లేదా పట్టణం గానీ లేదా ఎడారి గానీ, అల్లాహ్ ఏ ఒక్క ఇంటినీ విడిచి పెట్టకుండా ఈ ధర్మాన్ని (ఇస్లాంను) ప్రవేశింపజేస్తాడు; తద్వారా గౌరవనీయులకు గౌరవాన్ని ప్రసాదిస్తూ, అవమానకరమైన వారిని అవమానం పాలు చేస్తూ; ఇక్కడ గౌరవం అంటే ఇస్లాం ద్వారా కలుగజేయబడే గౌరవం; మరియు అవమానం అంటే అవిశ్వాసం ద్వారా కలుగజేయబడే అవమానం.” తమీమ్ అద్దారీ రజియల్లాహు అన్హు ఇలా అంటూ ఉండేవారు: “వాస్తవంలో నా కుటుంబ సభ్యులలోనే ఇలా జరగడం నాకు తెలుసు. వారిలో ఇస్లాం స్వీకరించిన వారికి వాస్తవంగా శుభాలు, గౌరవం మరియు కీర్తి లభించాయి; మరియు వారిలో ఎవరైతే సత్యతిరస్కారులై, అవిశ్వాసులుగా ఉండిపోయారో, వాస్తవములో వారు అధోగతి పాలై, అవమానం పాలై, ‘జిజియా’ చెల్లించే స్థితిలో ఉండిపోయారు.”

[దృఢమైనది] - [దాన్ని ఆహ్మద్ ఉల్లేఖించారు] - [مسند أحمد - 16957]

వివరణ

ఈ హదీథులో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా తెలియజేస్తున్నారు: భూమి యొక్క అన్ని ప్రాంతాలకు ఈ ధర్మం వ్యాపిస్తుంది, రాత్రింబవళ్ళు ఎక్కడెక్కడికి చేరుకుంటాయో, ఈ ధర్మం అక్కడి వరకు చేరుకుంటుంది అని. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఈ ధర్మాన్ని ప్రవేశపెట్టకుండా ఏ ఇంటినీ వదిలి పెట్టడు, పట్టణాలలో, గ్రామాలలో, ఎడారిలో లేదా అరణ్యంలో ఎక్కడైనా సరే. ఎవరైతే ఈ ధర్మాన్ని అంగీకరించి, స్వీకరిస్తారో, దానిని విశ్వసిస్తారో వారు (అల్లాహ్) ఇస్లాంకు ప్రసాదించే గౌరవంతో గౌరవించబడతారు, మరియు ఎవరైతే దానిని తిరస్కరిస్తారో, మరియు ఆ ధర్మాన్ని విశ్వసించరో, అలాంటి వారు అవమానానికి, పరాభవానికి గురిచేయబడతారు.
ఈ హదీసు ఉల్లేఖించిన సహాబీ తమీమ్ అద్దారీ రజియల్లాహు అన్హు ఇంకా ఇలా తెలియజేసారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ ప్రకటన నిజమవడాన్ని తాను చూశానని, ముఖ్యంగా తన కుటుంబ సభ్యులలో - ఎవరైతే ఇస్లాం స్వీకరించినాడో, అతడు మంచితనం, గౌరవం మరియు కీర్తిని పొందాడు, మరియు ఎవరైతే అవిశ్వాసిగానే మిగిలి పోయాడో, అతడు ముస్లింలకు జీజియాగా డబ్బు చెల్లించవలసి రావడంతో పాటు, అవమానానికి మరియు పరాభవానికి గురయ్యాడు.

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ పష్టో అస్సామీ السويدية الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية Юрба الدرية الصومالية Кинёрвондӣ الرومانية Малагашӣ Урумӣ Канада
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ఈ హదీసులో ముస్లిములందరికీ ఒక శుభవార్త ఉన్నది, అదేమిటంటే వారి ధర్మం భూమిపై ప్రతి ఒక్క భాగానికి వ్యాపిస్తుంది.
  2. ఇస్లాం కు మరియు ముస్లిములకు గౌరవం, మరియు అవిశ్వాసులకు అవమానాలు, పరాభవం ఉంటాయి.
  3. ఈ హదీసు ప్రవక్తత్వానికి సంబంధించిన సంకేతాలలో ఒక సంకేతాన్ని కలిగి ఉంది, ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు తెలియజేసినట్లుగానే ఈ విషయం సంభవించింది.
ఇంకా