عَنْ عَبْدِ اللَّهِ بْنِ عَمْرِو بْنِ الْعَاصِ رضي الله عنهما أنَّ رَسولَ اللَّهِ صلَّى اللَّهُ عليْه وسلَّمَ، قال:
«قَدْ أَفْلَحَ مَن أَسْلَمَ، وَرُزِقَ كَفَافًا، وَقَنَّعَهُ اللَّهُ بما آتَاهُ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 1054]
المزيــد ...

అబ్దుల్లాహ్ బిన్ అమర్ బిన్ ఆస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"ఎవరు ఇస్లాం‌ను అంగీకరించారో, తగినంత జీవనాధారం పొందారో, మరియు అల్లాహ్ తనకు ఇచ్చిన దానితో సంతృప్తి చెందారో, నిశ్చయంగా అతను విజయవంతుడయ్యాడు."

[ప్రామాణికమైన హదీథు] - [ముస్లిం నమోదు చేసినారు:] - [సహీహ్ ముస్లిం - 1054]

వ్యాఖ్యానము

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టంగా ఇలా చెప్పినారు: "ఎవరైతే తన ప్రభువు (అల్లాహ్)కు సమర్పించుకుని, ఆయన ద్వారా ఇస్లాం మార్గాన్ని పొందుతాడో, అతని అవసరాలకు సరిపడే హలాల్ జీవనోపాధి పొందుతాడో, (అధికంగానూ కాదు, తక్కువగానూ కాదు — అవసరానికి సరిపడేంత మాత్రమే), అల్లాహ్ అతనికి ప్రసాదించిన దానితో అతను సంతృప్తిగా, ఆనందంగా ఉంటాడో - అతడే నిజమైన విజేత, విజయాన్ని సాధించినవాడు."

హదీథు యొక్క ప్రయోజనాలలో నుండి

  1. ఒక వ్యక్తి ఆనందం అతని ధర్మం యొక్క పరిపూర్ణత, అతని జీవనోపాధి యొక్క సమృద్ధి మరియు అల్లాహ్ అతనికి ప్రసాదించిన దానితో అతని సంతృప్తిపై ఆధారపడి ఉంటుంది.
  2. ఇస్లాం మరియు సున్నతులతో పాటు ఈ ప్రపంచంలో నుండి మీకు ప్రసాదించబడిన దానితో సంతృప్తి చెందడం ప్రోత్సహించబడింది.
అనువాదాలను చూపించండి
భాష: الإنجليزية الأوردية الإسبانية ఇంకా (43)
ఇంకా