عَنْ أَبِي مُوسَى رضي الله عنه عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ:
«إِنَّ لِلْمُؤْمِنِ فِي الْجَنَّةِ لَخَيْمَةً مِنْ لُؤْلُؤَةٍ وَاحِدَةٍ مُجَوَّفَةٍ، طُولُهَا سِتُّونَ مِيلًا، لِلْمُؤْمِنِ فِيهَا أَهْلُونَ، يَطُوفُ عَلَيْهِمِ الْمُؤْمِنُ فَلَا يَرَى بَعْضُهُمْ بَعْضًا».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 2838]
المزيــد ...
అబూ మూసా రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
«నిశ్చయంగా స్వర్గంలో విశ్వాసి కొరకు ఒకే ఒక ముత్యంతో చేసిన, అరవై మైళ్ల పొడవు ఉన్న ఓ గుడారం ఉంటుంది. అందులో ఆ విశ్వాసి కుటుంబ సభ్యులు ఉంటారు. విశ్వాసి వారి చుట్టూ తిరుగుతూ ఉంటాడు, కానీ (గుడారం విశాలం వలన) ఒకరినొకరు చూడలేరు.»
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 2838]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గపు సుఖభోగాల గురించి తెలియజేశారు. స్వర్గంలో విశ్వాసికి ఒక్క పెద్ద, విశాలమైన గుడారం ఉంటుంది. ఇది ఒకే ఒక పెద్ద ముత్యంతో తయారు చేయబడి, లోపల ఖాళీగా ఉంటుంది. దీని వెడల్పు, పొడవు ఆకాశంలో అరవై మైళ్లు ఉంటుంది. దీని నాలుగు మూలల్లోని ప్రతి భాగంలో భార్యలు ఉంటారు. వారు (గుడారం విశాలం వలన) ఒకరినొకరు చూడలేరు. విశ్వాసి వారి మధ్య తిరుగుతూ ఉంటాడు.