عَنْ عُبَيْدِ اللَّهِ بْنِ مِحْصَنٍ الْأَنْصَارِيِّ رَضيَ اللهُ عنهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:
«مَنْ أَصْبَحَ مِنْكُمْ مُعَافى فِي جَسَدِهِ، آمِنًا فِي سِرْبِهِ، عِنْدَهُ قُوتُ يَوْمِهِ، فَكَأَنَّمَا حِيزَتْ لَهُ الدُّنْيَا».
[حسن] - [رواه الترمذي وابن ماجه] - [سنن ابن ماجه: 4141]
المزيــد ...
ఉబైదుల్లాహ్ బిన్ మిహ్సన్ అల్-అన్సారీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"మీలో ఎవరైతే ఉదయం లేచినప్పుడు ఆరోగ్యంగా, తన ఇంట్లో సురక్షితంగా, ఆ రోజుకి సరిపడా ఆహారం కలిగి ఉంటారో, అతనికి ఈ ప్రపంచమంతా ప్రసాదించబడినట్లే."
[ప్రామాణికమైనది] - - [سنن ابن ماجه - 4141]
ఓ ముస్లింలారా! మీలో ఎవరైనా, ఉదయం లేచినపుడు, ఆరోగ్యంగా, అనారోగ్యం లేకుండా ఉంటాడో; తనలో, తన కుటుంబంలో, తనపై ఆధారపడినవారిలో, తన మార్గంలో సురక్షితంగా, భయపడకుండా ఉంటాడో; ఆ రోజుకు సరిపడా న్యాయబద్ధమైన ఆహారం కలిగి ఉంటాడో, ప్రపంచం మొత్తం అతని కోసం సమకూర్చబడినట్లుగా ఉంటుందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టం చేసినారు.