عَنْ ابْنِ عُمَرَ رَضيَ اللهُ عنهُما أَنَّهُ سَمِعَ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَا حَقُّ امْرِئٍ مُسْلِمٍ لَهُ شَيْءٌ يُوصِي فِيهِ، يَبِيتُ ثَلَاثَ لَيَالٍ، إِلَّا وَوَصِيَّتُهُ عِنْدَهُ مَكْتُوبَةٌ»، قَالَ عَبْدُ اللهِ بْنُ عُمَرَ رضي الله عنهما: «مَا مَرَّتْ عَلَيَّ لَيْلَةٌ مُنْذُ سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ ذَلِكَ إِلَّا وَعِنْدِي وَصِيَّتِي».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 1627]
المزيــد ...
అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించగా విన్నారు:
"ఒక ముస్లిం తన వీలునామా రాసి తనతో ఉంచుకోకుండా మూడు రాత్రులు ఉండడం సముచితం కాదు." అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఇలా అన్నారు: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అనడం నేను విన్నప్పటి నుండి, నా వీలునామా నాతో లేకుండా ఒక్క రాత్రి కూడా గడిచిపోలేదు.
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 1627]
ఒక ముస్లింకు వీలునామా రాసి ఇవ్వడానికి ఏవైనా హక్కులు లేదా ఆస్తులు ఉంటే, అది చిన్నదైనా సరే, తన వీలునామా రాసి సిద్ధంగా ఉంచుకోకుండా మూడు రాత్రులు గడపరాదని ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలియజేశారు. అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదిఅల్లాహు అన్హుమా ఇలా అన్నారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అలా చెప్పగా విన్నప్పటి నుండి, నా వీలునామా నా వద్ద సిద్ధంగా లేకుండా నేను ఒక్క రాత్రి కూడా గడపలేదు.