عن أسامة بن زيد رضي الله عنهما عن النبي صلى الله عليه وسلم قال:
«مَا تَرَكْتُ بَعْدِي فِتْنَةً أَضَرَّ عَلَى الرِّجَالِ مِنَ النِّسَاءِ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 5096]
المزيــد ...
ఉసామా ఇబ్న్ జైద్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“స్త్రీల కంటే ఎక్కువగా మగవారికి హాని కలగజేసే ఏ ‘ఫిత్నా’ (ఏ పరీక్షా, ఏ విపత్తూ) నేను నా వెనుక వదిలి వెళ్ళుట లేదు”.
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 5096]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పేర్కొన్నారు: ‘స్త్రీల కంటే ఎక్కువ మగవారికి హాని కలిగించే ఏ ‘ఫిత్నా’ (ఏ పరీక్షా, ఏ విపత్తూ) నేను నా వెనుక వదిలి వెళ్ళుట లేదు’. ఒకవేళ ఆమె కుటుంబంలోని వ్యక్తి అయితే షరియత్ కు వ్యతిరేకంగా ఆమె పాల్బడే పనులలో అతడు ఆమె అడుగుజాడల లెక్క తీసుకోవచ్చు; ఒకవేళ ఆమె అతనికి పరిచయం లేని వ్యక్తి అయితే, అతడు ఆమెను కలవడం, ఇంకా ఆమెతో ఒంటరితనం – తత్కారణంగా ఉత్పన్నమయ్యే కీడు, చెడు – ఇవన్నీ కూడా అతడిని ‘ఫిత్నా’లో పడవేసే కారణాలే.