عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ وَأَبِي هُرَيْرَةَ رضي الله عنهما عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«يُنَادِي مُنَادٍ: إِنَّ لَكُمْ أَنْ تَصِحُّوا فَلَا تَسْقَمُوا أَبَدًا، وَإِنَّ لَكُمْ أَنْ تَحْيَوْا فَلَا تَمُوتُوا أَبَدًا، وَإِنَّ لَكُمْ أَنْ تَشِبُّوا فَلَا تَهْرَمُوا أَبَدًا، وَإِنَّ لَكُمْ أَنْ تَنْعَمُوا فَلَا تَبْأَسُوا أَبَدًا» فَذَلِكَ قَوْلُهُ عَزَّ وَجَلَّ: {وَنُودُوا أَنْ تِلْكُمُ الْجَنَّةُ أُورِثْتُمُوهَا بِمَا كُنْتُمْ تَعْمَلُونَ} [الأعراف: 43].
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2837]
المزيــد ...
అబూ సఈద్ అల్ ఖుద్రీ మరియు అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ప్రకటన చేసేవాడు ఇలా ప్రకటిస్తాడు: “మీరు శాశ్వతంగా ఆరోగ్యవంతులై ఉంటారు; ఎన్నటికీ వ్యాధిగ్రస్తులు కారు; మీరు శాశ్వతంగా జీవితులై ఉంటారు, ఎన్నటికీ చనిపోరు; మీరు శాశ్వతంగా యవ్వనంలో ఉంటారు, ఎన్నటికీ వృద్ధులు కారు; మరియు మీరు ఎల్లప్పుడూ సిరిసంపదలతో, సంపన్న పరిస్థితుల్లో జీవిస్తారు మరియు ఎప్పటికీ నిరుపేదలుగా మారరు; ఇది సర్వోన్నతుడైన, సర్వశ్రేష్ఠుడైన అల్లాహ్ యొక్క వాక్కు: అపుడు వారికి ఒక వాణి వినబడుతుంది: ''మీరు చేస్తూ ఉండిన సత్కార్యాలకు ఫలితంగా మీరు వారసులుగా చేయబడిన స్వర్గం ఇదే! సూరతుల్ ఆరాఫ్ 7:43.
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 2837]
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రస్తావించారు: స్వర్గములోనికి చేరిన ప్రజలు సంతోషానందాలతో ఉండగా వారిని ఉద్దేశించి ప్రకటన చేసేవాడొకడు ఇలా ప్రకటిస్తాడు: స్వర్గంలో మీరు శాశ్వతంగా ఆరోగ్యవంతులై ఉంటారు, ఎన్నటికీ వ్యాధిగ్రస్తులు కారు, అది ఎంత చిన్న సుస్తీ లేక నలత అయినా సరే; అక్కడ మీరు శాశ్వత జీవితులై ఉంటారు, ఎన్నటికీ మరణించరు, అది స్వల్పకాల మరణంగా భావించబడే నిద్ర అయినా సరే; అక్కడ మీరు శాశ్వతంగా యవ్వనవంతులై ఉంటారు, ఎన్నటికీ వృధ్ధులు కారు; మరియు మీరు అక్కడ సుఖసంతోషాలతో, సిరిసంపదలతో సంపన్నులుగా జీవిస్తారు, ఎప్పుడూ మీకు కష్టము, బాధ, పేదరికం కలుగవు. ఎందుకంటే ఇది సర్వశక్తిమంతుడైన అల్లాహ్ తెలిపిన ప్రకటన: అపుడు వారికి ఒక వాణి వినబడుతుంది: ''మీరు చేస్తూ ఉండిన సత్కార్యాలకు ఫలితంగా మీరు వారసులుగా చేయబడిన స్వర్గం ఇదే!) సూరతుల్ ఆరాఫ్ 7:43.