عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«نَارُكُمْ جُزْءٌ مِنْ سَبْعِينَ جُزْءًا مِنْ نَارِ جَهَنَّمَ»، قِيلَ: يَا رَسُولَ اللَّهِ، إِنْ كَانَتْ لَكَافِيَةً. قَالَ: «فُضِّلَتْ عَلَيْهِنَّ بِتِسْعَةٍ وَسِتِّينَ جُزْءًا كُلُّهُنَّ مِثْلُ حَرِّهَا».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 3265]
المزيــد ...
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
“మీ ఈ (ప్రపంచపు) అగ్ని, నరకాగ్ని యొక్క డెభ్భై భాగాలలో ఒకటి.” అది విని మాలో ఒకరు “ఓ రసూలుల్లాహ్! (అవిశ్వాసులను శిక్షించడానికి) ఈ అగ్ని సరిపోతుంది కదా!” అని అడిగారు. దానికి ఆయన “ఈ అగ్ని కంటే నరకాగ్ని ఇంకా అరవై తొమ్మిది భాగాలు ఎక్కువ ఉంటుంది. దాని ప్రతి భాగమూ ఈ అగ్ని అంత వేడిని కలిగి ఉంటుంది” అన్నారు.
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 3265]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీసులో, ఈ ప్రపంచపు అగ్ని, నరకాగ్ని యొక్క డెభ్భై భాగాలలో ఒక భాగము అని తెలియ జేస్తున్నారు. నరకాగ్ని యొక్క వేడి, ఈ ప్రపంచపు అగ్ని వేడి కంటే అరవైతొమ్మిది రెట్లు ఎక్కువగా ఉంటుంది. దాని ప్రతి భాగమూ ఈ ప్రపంచపు అగ్ని అంత వేడిని కలిగి ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇలా అన్నారు “ఓ రసూలుల్లాహ్! నరకంలోనికి ప్రవేశించే వారిని శిక్షించడానికి ఈ అగ్ని (అంత వేడి) సరిపోతుంది కదా!” దానికి ఆయన “ఈ ప్రపంచపు అగ్ని కంటే, నరకాగ్ని అరవై తొమ్మిది రెట్లు ఘనమైనది. దాని ఒక్కొక్క భాగము యొక్క వేడి ఈ ప్రపంచపు అగ్ని అంత ఉంటుంది” అన్నారు.