عَنْ صُهَيْبٍ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«عَجَبًا لِأَمْرِ الْمُؤْمِنِ، إِنَّ أَمْرَهُ كُلَّهُ خَيْرٌ، وَلَيْسَ ذَاكَ لِأَحَدٍ إِلَّا لِلْمُؤْمِنِ، إِنْ أَصَابَتْهُ سَرَّاءُ شَكَرَ، فَكَانَ خَيْرًا لَهُ، وَإِنْ أَصَابَتْهُ ضَرَّاءُ صَبَرَ، فَكَانَ خَيْرًا لَهُ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2999]
المزيــد ...
షుఐబ్ ఇబ్న్ సినాన్ అర్’రూమీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ఒక విశ్వాసి యొక్క వ్యవహారం ఎంత అద్భుతమైనది! నిశ్చయంగా అతని అన్ని వ్యవహారాలు అతని కొరకు శుభాల్నే కలిగి ఉంటాయి. ఇలా ఒక విశ్వాసికి తప్ప మరింకెవరికీ ఉండదు. ఒకవేళ అతనికి మంచి కలిగితే, అతడు (అల్లాహ్’కు కృతజ్ఞతలు తెలుపుకుని) కృతజ్ఞుడై ఉంటాడు, అది అతనికి శుభప్రదమైనది; ఒకవేళ అతనికి ఏదైనా ఆపద కలిగితే, అతడు దానిపై సహనం వహిస్తాడు, అది కూడా అతనికి శుభప్రదమైనదే.”
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 2999]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వాసి యొక్క స్థితి మరియు అతని వ్యవహారాల పట్ల ప్రశంసా పూర్వకమైన ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు; ఎందుకంటే అతడి అన్ని పరిస్థితులూ అతని కొరకు శుభాన్ని కలిగి ఉంటాయి. ఈ పరిస్థితి కేవలం ఒక విశ్వాసికి తప్ప మరింకెవ్వరికీ ఉండదు. ఒకవేళ అతనికి ఏదైనా శుభం కలిగితే అతడు దానిపై అల్లాహ్’కు కృతఙ్ఞతలు అర్పిస్తాడు, ఇంకా మరింతగా కృతజ్ఞుడై ఉంటాడు. దానికి గాను అతడు (తీర్పు దినాన) ప్రతిఫలం కూడా పొందుతాడు. అలాగే ఒకవేళ అతనికి ఏదైనా ఆపద కలిగితే అతడు దానిపై సహనం వహిస్తాడు. అల్లాహ్ నుండి ప్రతిఫలాన్ని ఆశిస్తాడు, అందుకు అతనికి ప్రతిఫలం లభిస్తుంది. కనుక ప్రతి స్థితిలోనూ అతనికి ప్రతిఫలం బహూకరించబడుతుంది.