عَنْ جَرِيرِ بْنِ عَبْدِ اللهِ رَضيَ اللهُ عنه قَالَ:
سَأَلْتُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ عَنْ نَظَرِ الْفُجَاءَةِ فَأَمَرَنِي أَنْ أَصْرِفَ بَصَرِي.
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2159]
المزيــد ...
జరీర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం :
“నేను రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంను (పరస్త్రీపై) అనుకోకుండా, ఆకస్మికంగా పడిన చూపును గురించి ప్రశ్నించాను. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించినారు “నీ చూపును మరల్చుకో”
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 2159]
జరీర్ ఇబ్న్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఒక వ్యక్తి ఒక పరాయిస్త్రీని అకస్మాత్తుగా చూడటం గురించి అడిగారు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తాను పరాయి స్త్రీని చూస్తున్నాడని గ్రహించిన వెంటనే తన ముఖాన్ని మరో వైపునకు అంటే మరో దిశకు మళ్లించుకోవాలని ఆదేశించినారు; అపుడు అతనిపై ఏ దోషమూ ఉండదు.