عَنْ صَفْوَانَ بْنِ مُحْرِزٍ قَالَ: قَالَ رَجُلٌ لِابْنِ عُمَرَ رضي الله عنهما كَيْفَ سَمِعْتَ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، يَقُولُ: فِي النَّجْوَى؟ قَالَ: سَمِعْتُهُ يَقُولُ:
«يُدْنَى الْمُؤْمِنُ يَوْمَ الْقِيَامَةِ مِنْ رَبِّهِ عَزَّ وَجَلَّ، حَتَّى يَضَعَ عَلَيْهِ كَنَفَهُ، فَيُقَرِّرُهُ بِذُنُوبِهِ، فَيَقُولُ: هَلْ تَعْرِفُ؟ فَيَقُولُ: أَيْ رَبِّ أَعْرِفُ، قَالَ: فَإِنِّي قَدْ سَتَرْتُهَا عَلَيْكَ فِي الدُّنْيَا، وَإِنِّي أَغْفِرُهَا لَكَ الْيَوْمَ، فَيُعْطَى صَحِيفَةَ حَسَنَاتِهِ، وَأَمَّا الْكُفَّارُ وَالْمُنَافِقُونَ، فَيُنَادَى بِهِمْ عَلَى رؤُوسِ الْخَلَائِقِ هَؤُلَاءِ الَّذِينَ كَذَبُوا عَلَى اللهِ».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 2768]
المزيــد ...
సఫ్’వాన్ ఇబ్న్ ముహ్రిజ్ (రహిమహుల్లాహ్) ఉల్లేఖన: “ఒక వ్యక్తి అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ (రదియల్లాహు అన్హు) వద్దకు వచ్చి ఇలా అడిగాడు: “ ‘నజ్వా’లో (నజ్వా: రహస్య సమావేశం) రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమి పలుకగా మీరు విన్నారు?” అని. దానికి ఆయన ఇలా అన్నారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“తీర్పు దినమున ఒక విశ్వాసి సర్వశక్తిమంతుడైన తన ప్రభువు దగ్గరికి తీసుకురాబడతాడు, మరియు ఆయన అతనికి తన కనఫహ్ (దాచి ఉంచుట) ను ప్రసాదిస్తాడు (అతడిని మిగతా వారి నుండి మరుగు పరుస్తాడు) తరువాత అతని పాపాలను ఒప్పుకునేలా చేస్తాడు, అల్లాహ్ అతనితో ఇలా అంటాడు: “(నువ్వు ఈ విధంగా చేసావు) నీకు తెలుసు కదా!” దానికి అతడు “ఓ నా ప్రభూ! అవును (నేను చేసాను) నాకు తెలుసు” అంటాడు. అపుడు అల్లాహ్ ఇలా అంటాడు: “నిశ్చయంగా నేను వాటిని నీ కొరకు ఇహలోకంలో దాచి ఉంచినాను, మరియు ఈ దినము నీ కొరకు వాటిని క్షమించినాను.” మరియు అతనికి అతని సత్కార్యాల చిట్ఠా ఇవ్వబడుతుంది. సత్యతిరస్కారులు మరియు కపటుల విషయానికొస్తే, వారు సమస్త సృష్టి ముందు పిలవబడతారు: వీరే అల్లాహ్ పై అబద్ధం చెప్పినవారు.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 2768]
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పునరుత్థాన దినమున విశ్వాసి అయిన తన దాసుడితో అల్లాహ్ జరిపే సన్నిహిత సంభాషణ గురించి తెలియజేస్తూ ఆయన (స) ఇలా అన్నారు:
పునరుత్థాన దినమున విశ్వాసి తన ప్రభువు దగ్గరికి తీసుకురాబడతాడు. అపుడు అల్లాహ్ అతడిని మిగతా వారి నుండి మరుగు పరుస్తాడు, అతని రహస్యాలు మిగతావారికి తెలియకుండా ఉండేలా. తరువాత అతనితో అల్లాహ్ ఇలా అంటాడు:
“(నువ్వు) ఫలానా, ఫలానా పాపం (చేసినావు) నీకు తెలుసు కదా?” దాసునికీ మరియు అతని ప్రభువుకు మధ్య ఉన్న పాపాలను అతను గుర్తించేలా చేస్తాడు.
దానికి అతడు: “అవును ఓ నా ప్రభూ” అని ఒప్పుకుంటాడు.
విశ్వాసి భయపడిపోతాడు, అపుడు సర్వ శక్తిమంతుడైన అల్లాహ్, అతనితో ఇలా అంటాడు: నేను ఈ లోకంలో నీ కోసం దానిని కప్పి ఉంచాను మరియు ఈ రోజు నీ కోసం దానిని క్షమించాను. తరువాత అతనికి అతని మంచి పనుల రికార్డు ఇవ్వబడుతుంది.
సత్యతిరస్కారికి, కపట విశ్వాసికి సంబంధించి, అందరి ముందు ఇలా అనబడుతుంది: “వీరే తమ ప్రభువుపై అబద్ధం చెప్పినవారు. దుర్మార్గులపై అల్లాహ్ శాపం పడుగాక.”