+ -

عن الْأَغَرِّ رضي الله عنه، وَكَانَ مِنْ أَصْحَابِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«يَا أَيُّهَا النَّاسُ تُوبُوا إِلَى اللهِ، فَإِنِّي أَتُوبُ فِي الْيَوْمِ إِلَيْهِ مِائَةَ مَرَّةٍ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2702]
المزيــد ...

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలలో ఒకరైన అల్ అగర్రి రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"ఓ ప్రజలారా! అల్లాహ్ వద్ద పశ్చాత్తాపపడండి, ఎందుకంటే నేను రోజుకు వంద సార్లు ఆయన వద్ద పశ్చాత్తాపపడతాను."

[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 2702]

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలను అల్లాహ్ వద్ద పశ్చాత్తాపపడాలని మరియు తరుచుగా ఆయన క్షమాపణను కోరుకోవాలని ఆజ్ఞాపించారు. తన గత మరియు భవిష్యత్ పొరపాట్లు క్షమించబడినప్పటికీ, తాను ప్రతిరోజు వందకు పైగా అల్లాహ్ వద్ద పశ్చాత్తాపపడుతున్నానని మరియు ఆయన క్షమాపణను కోరుతున్నానని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తనకు తానుగా తెలియజేస్తున్నారు. ఇది అల్లాహ్ కు పరిపూర్ణ విధేయత మరియు దాస్యాన్ని సూచిస్తుంది.

من فوائد الحديث

  1. ప్రతి ఒక్కరూ, తమ హోదా మరియు విశ్వాసం యొక్క స్థాయితో సంబంధం లేకుండా, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ వైపు మరలాలి మరియు ఆయన వద్ద పశ్చాత్తాపం చెందడం ద్వారా తనను తాను పరిపూర్ణం చేసుకోవాలి. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ హక్కులను ఎవ్వరూ కూడా ఎలాంటి కొరతలు, లోపాలు కూడా లేకుండా పూర్తిగా నెరవేర్చలేరు: {ఓ విశ్వాసులారా! అందరూ కలిసి పశ్చాత్తాపంతో అల్లాహ్ వైపు మరలండి}.
  2. నిషేధించబడిన పనులు మరియు పాపాలు చేసినందుకు లేదా తప్పనిసరి విధులను నిర్వర్తించడంలో విఫలమైనందుకు పశ్చాత్తాపం చెందడం సర్వ సాధారణం.
  3. పశ్చాత్తాపం అంగీకరించబడటానికి నిజాయితీ, చిత్తశుద్ధి ఒక షరతు. అల్లాహ్ కోసం కాకుండా ఇతరుల కోసం పాపాన్ని వదిలివేసే వ్యక్తి పశ్చాత్తాపపడిన వ్యక్తిగా పరిగణించబడడు.
  4. ఇమామ్ నవవి ఇలా అన్నారు: పశ్చాత్తాపం ఆమోదించబడేందుకు మూడు షరతులు ఉన్నాయి: ఆ పాపాన్ని విడిచి పెట్టడం, దానిని చేసినందుకు పశ్చాత్తాపపడటం మరియు అలాంటి పాపాన్ని ఎన్నటికీ మరలా చేయకూడదని దృఢంగా నిర్ణయించుకోవడం. ఒకవేళ ఆ పాపం మరొక వ్యక్తి హక్కును కలిగి ఉంటే, అందుకు నాల్గవ షరతు కూడా పూర్తి చేయవలసి ఉంది: తప్పుగా, పొరపాటుగా(లేదా కావాలని) తీసుకున్న అతడి వస్తువును అతడికి వాపసు చేయడం లేదా అన్యాయం చేసిన వ్యక్తి నుండి క్షమాపణ కోరడం.
  5. ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం క్షమాపణ కోరడం అంటే ముఖ్యంగా ఆయన పాపాలు చేశారని సూచించడం కాదని గమనించ వలెను. బదులుగా, ఇది ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం దాస్యం యొక్క పరిపూర్ణతను మరియు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ స్మరణతో ఆయనకున్న నిరంతర సంబంధాన్ని, అలాగే అల్లాహ్ హక్కుల గొప్పతనం మరియు దాసుల లోపాల గురించి ఆయనకున్న అవగాహనను ప్రతిబింబిస్తుంది, అల్లాహ్ యొక్క ఆశీర్వాదాలకు ఎంత కృతజ్ఞతలు తెలిపినా కూడా సరిపోదు. ఇది ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత సమాజం కోసం ఇతర కారణాలతో పాటు ధార్మిక చట్టంలో భాగంగా కూడా పనిచేస్తుంది, .
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ వియత్నమీస్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ అస్సామీ السويدية الهولندية الغوجاراتية الرومانية المجرية الموري Канада الأوكرانية الجورجية المقدونية
అనువాదాలను వీక్షించండి
ఇంకా