عَنْ أَبِي سَعِيدٍ الخُدْرِيِّ رضي الله عنه قَالَ:
كَانَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَشَدَّ حَيَاءً مِنَ العَذْرَاءِ فِي خِدْرِهَا، فَإِذَا رَأَى شَيْئًا يَكْرَهُهُ عَرَفْنَاهُ فِي وَجْهِهِ.
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 6102]
المزيــد ...
అబూ సఈద్ అల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం :
ఇంట్లోని ఒక మూలలో ఒదిగి ఉండే ఒక బాలిక కంటే ఎక్కువ వినయాన్ని, బిడియాన్ని, నిరాడంబరతను “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కలిగి ఉండేవారు. ఒకవేళ ఎపుడైనా ఆయన తనకు ఇష్టం లేనిది ఏదైనా చూస్తే, ఆయన ముఖాన్ని చూసి మేము అది వెంటనే గ్రహించేవారము.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 6102]
అబూ సఈద్ అల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఇలా తెలియజేస్తున్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం - ఇంకా వివాహం చేసుకోని మరియు పురుషులతో ఎప్పుడూ సన్నిహితంగా మెలగని, తన ఇంటి వారితోనే ఎక్కువగా ఉండే అమ్మాయి కంటే కూడా ఎక్కువ బిడియము, నిరాడంబరత, వినయము కలిగి ఉండేవారు. ఈ లక్షణాలు ఆయనలో ఎంత ఎక్కువగా ఉండేవి అంటే, ఆయన ఏదైనా విషయాన్ని ఇష్టపడకపోతే, వెంటనే ఆయన ముఖం మారిపోయేది, (కొంతసేపు) ఆయన మాట్లాడేవారు కాదు. ఆయన సహాబాలు ఆయన ముఖం మీద అయిష్టతను చూసి అర్థం చేసుకునేవారు.