عَنْ عَائِشَةَ أُمِّ المُؤْمِنين رَضِيَ اللَّهُ عَنْهَا، قَالَتْ:
مَا رَأَيْتُ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ مُسْتَجْمِعًا قَطُّ ضَاحِكًا، حَتَّى أَرَى مِنْهُ لَهَوَاتِهِ، إِنَّمَا كَانَ يَتَبَسَّمُ.
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 6092]
المزيــد ...
విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖన:
“నేను ఎన్నడూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను తన కొండనాలుక కనిపించేటంతగా (నోరు తెరిచి) మనస్ఫూర్తిగా నవ్వడం చూడలేదు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కేవలం చిరునవ్వు మాత్రమే నవ్వేవారు.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 6092]
ఆయిషా (రదియల్లాహు అన్హా) ఇలా తెలియజేస్తున్నారు – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నడూ, తన ‘లహాత్’ – నోటిలో గొంతు పైభాగాన వ్రేళ్ళాడుతూ ఉన్నట్లు ఉండే మాంసపు తునక అంటే కొండనాలుక - కనిపించేటంత ఎక్కువగా నవ్వలేదు. ఆయన కేవలం చిరునవ్వు మాత్రం నవ్వేవారు.