عَن عَبْدِ اللهِ بْنِ عَمْرِو بْنِ الْعَاصِ رضي الله عنهما أَنَّهُ سَمِعَ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، يَقُولُ:
«إِنَّ قُلُوبَ بَنِي آدَمَ كُلَّهَا بَيْنَ إِصْبَعَيْنِ مِنْ أَصَابِعِ الرَّحْمَنِ، كَقَلْبٍ وَاحِدٍ، يُصَرِّفُهُ حَيْثُ يَشَاءُ» ثُمَّ قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «اللهُمَّ مُصَرِّفَ الْقُلُوبِ صَرِّفْ قُلُوبَنَا عَلَى طَاعَتِكَ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2654]
المزيــد ...
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలకడం విన్నాను అని అబ్దుల్లాహ్ బిన్ అమర్ బిన్ అల్ ఆస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించినారు.
నిశ్ఛయంగా ఆదము సంతానం (మానవుల) హృదయాలన్నీ ఆ దయామయుడి (అల్లాహ్) రెండు వేళ్ల మధ్యలో ఒకే ఒక్క హృదయంలా ఉంటాయి. ఆయన తన ఇష్టం ప్రకారం వాటిని తిప్పుతాడు." తర్వాత అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రార్థించారు: "అల్లాహుమ్మ ముసర్రిఫ్ అల్-ఖులూబ్ సర్రిఫ్ ఖులూబనా అలా తా’అతిక్ (ఓ అల్లాహ్! హృదయాలను తిప్పేవాడా, మా హృదయాలను నీ విధేయత వైపు మళ్లించు).
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 2654]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఇలా తెలిపినారు: ఆదము సంతతి (మానవుల) హృదయాలన్నీ దయామయుడైన అర్రహ్మాన్ (అల్లాహ్) యొక్క రెండు వేళ్ల మధ్యలో ఒక్క హృదయంలా ఉంటాయి. ఆయన తన ఇష్టం ప్రకారం వాటిని తిప్పుతాడు. ఆయన తలుచుకుంటే దానిని సత్యమార్గంపై నిలుపుతాడు; లేదా తప్పుదారిలో విడిచి పెట్టేస్తాడు. హృదయాలన్నింటినీ నడిపించడం ఆయనకు ఒక్క హృదయాన్ని నడిపించడమంత సులభం. ఏ ఒక్క పని కూడా మరో పనికి ఆయన వద్ద అడ్డు తగలదు." తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రార్థించారు: "అల్లాహుమ్మ ముసర్రిఫల్-ఖులూబ్! (హృదయాలను తిప్పేవాడా!) కొన్నిసార్లు ఆజ్ఞాపాలన చేసేలా, కొన్నిసార్లు అవిధేయతకు పాల్బడేలా, కొన్నిసార్లు జ్ఞాపకం ఉంచుకునేలా, మరికొన్నిసార్లు మరచిపోయేలా హృదయాలను తిప్పే నీవు, మా హృదయాలను నీ ఆజ్ఞపాలన వైపు మాత్రమే తిప్పు."