+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ:
قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «إِنَّ اللَّهَ قَالَ: مَنْ عَادَى لِي وَلِيًّا فَقَدْ آذَنْتُهُ بِالحَرْبِ، وَمَا تَقَرَّبَ إِلَيَّ عَبْدِي بِشَيْءٍ أَحَبَّ إِلَيَّ مِمَّا افْتَرَضْتُ عَلَيْهِ، وَمَا يَزَالُ عَبْدِي يَتَقَرَّبُ إِلَيَّ بِالنَّوَافِلِ حَتَّى أُحِبَّهُ، فَإِذَا أَحْبَبْتُهُ: كُنْتُ سَمْعَهُ الَّذِي يَسْمَعُ بِهِ، وَبَصَرَهُ الَّذِي يُبْصِرُ بِهِ، وَيَدَهُ الَّتِي يَبْطِشُ بِهَا، وَرِجْلَهُ الَّتِي يَمْشِي بِهَا، وَإِنْ سَأَلَنِي لَأُعْطِيَنَّهُ، وَلَئِنِ اسْتَعَاذَنِي لَأُعِيذَنَّهُ، وَمَا تَرَدَّدْتُ عَنْ شَيْءٍ أَنَا فَاعِلُهُ تَرَدُّدِي عَنْ نَفْسِ المُؤْمِنِ، يَكْرَهُ المَوْتَ وَأَنَا أَكْرَهُ مَسَاءَتَهُ».

[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 6502]
المزيــد ...

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నిశ్చయంగా అల్లాహ్ ఇలా పలికినాడు: ‘ఎవరైతే నా వలీ పట్ల (వలీ – ధర్మనిష్టాపరుడైన అల్లాహ్ యొక్క దాసుడు) శతృత్వం వహిస్తాడో నేను అతనిపై యుద్ధాన్ని ప్రకటిస్తున్నాను. నేను ఏదైతే అతనిపై ‘ఫర్జ్’ చేసినానో అది నాకు అత్యంత ఇష్టమైనది; నా దాసుడు దాని ద్వారా తప్ప నాకు చేరువ కాలేడు. ఇంకా అతడు ‘నఫీల్’ ఆచరణలు ఆచరిస్తూ నాకు ఇంకా చేరువ అవుతూనే ఉంటాడు, ఎంతగా అంటే, నేను అతడిని ప్రేమించేంత వరకు. నేను అతడిని ప్రేమించినట్లయితే నేను అతడి వినికిడి శక్తినవుతాను, దేని ద్వారానైతే అతడు వింటాడో, నేను అతడి దృష్టినవుతాను, దేనిద్వారానైతే అతడు చూడగలుగుతాడో, నేను అతడి చేతినవుతాను, దేని ద్వారానైతే అతడు (శత్రువులను) ప్రతాడించుతాడో, నేను అతడి కాలునవుతాను, దేని ద్వారానైతే అతడు నడుస్తాడో. అతడు దేని కొరకైనా అర్థించినట్లయితే, నేను అతనికి తప్పనిసరిగా ప్రసాదిస్తాను; అతడు నా నుండి రక్షణ కోరితే, నేను అతనికి రక్షణ ప్రసాదిస్తాను. ఒక విశ్వాసి ప్రాణాలను తీసే విషయంలో సంకోచించినంతగా, నేను ఏ విషయములోనూ సంకోచించను. ఎందుకంటే అతడు మృత్యువును ఇష్టపడడు, మరియు అతనికి కష్టం కలిగించడాన్ని నేను ఇష్టపడను.”

[దృఢమైనది] - [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు] - [صحيح البخاري - 6502]

వివరణ

ఈ ‘హదీసుల్ ఖుద్సీ’ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – సర్వ శక్తిమంతుడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ ఇలా అన్నాడని తెలియజేస్తున్నారు: ఎవరైతే నా ఔలియాలలో ఏ వలీనైనా (వలీ: దైవభీతిపరుడు, ధర్మనిష్ఠాపరుడు అయిన అల్లాహ్ యొక్క దాసుడు; ‘వలీ’ ఏక వచనం, ‘ఔలియా’ బహువచనం –) బాధపెడతారో, అవమానించారో మరియు ద్వేషిస్తారో, నేను అతని పట్ల శత్రుత్వాన్ని ప్రకటిస్తున్నాను.
వలీ: అంటే, దైవభీతి కలిగిన, ధర్మనిష్టాపరుడైన, అల్లాహ్’కు ఇష్ఠుడైన ఒక విశ్వాసి: ‘విలాయహ్’ అనే పదానికి అనేక అర్థాలున్నాయి. ఇక్కడ ‘విలాయహ్’ అంటే అటువంటి దాసుని స్థితి, స్థానము. అల్లాహ్ పై అతని విశ్వాసము, దైవభక్తి మరియు అతని ధర్మనిష్ఠల యొక్క స్థాయిపై అతనిపట్ల అల్లాహ్ యొక్క ‘విలాయహ్’ ఆధారపడి ఉంటుంది. ఒక విశ్వాసి, తన ప్రభువు తనపై విధిగావించిన విషయాలను ఆచరించడం ద్వారా తప్ప మరింకే విషయం ద్వారా కూడా తన ప్రభువుకు చేరువ కాలేడు, ఉదాహరణకు: ఆయనకు విధేయత చూపే (ఆయన ఆదేశించిన) ఆచరణలను ఆచరించడం, మరియు ఆయన హరాం చేసిన (నిషేధించిన) విషయాలను వదలి వేయడం మొదలైనవి. అయితే విధిగా ఆచరించవలసిన విషయాలతో పాటు, స్వచ్చందంగా ఆచరించే అదనపు ఆరాధనల ద్వారా అతడు తన ప్రభువుకు మరింత చేరువ అవుతూ ఉంటాడు, తద్వారా అతడు అల్లాహ్ యొక్క ప్రేమను పొందుతాడు. మరి అల్లాహ్ అతడిని ప్రేమించినట్లయితే, అల్లాహ్ అతనికి ఈ క్రింద పేర్కొనబడిన నాలుగు (శరీర) భాగాలను సరైన మార్గనిర్దేశం ఇవ్వడం ద్వారా అతనికి సహాయపడతాడు.
అల్లాహ్ అతని వినికిడిలో అతనికి సరిగ్గా మార్గనిర్దేశం చేస్తాడు, అందువలన, అతను అల్లాహ్‌కు నచ్చినది తప్ప మరేమీ వినడు.
అల్లాహ్ అతని కళ్ళకు సరిగ్గా మార్గనిర్దేశం చేస్తాడు, అందువలన, అతను అల్లాహ్ ఇష్టపడే వాటిని మరియు ఆయనకు నచ్చిన వాటిని తప్ప మరేమీ చూడడు.
అల్లాహ్ అతని చేతులను సరిగ్గా మార్గనిర్దేశం చేస్తాడు,అందువలన అతను అల్లాహ్‌కు ఇష్టమైనది తప్ప తన చేతితో ఏమీ చేయడు.
అల్లాహ్ అతని పాదాలను సరిగా మార్గనిర్దేశం చేస్తాడు. అందువలన అతడు అల్లాహ్ ఇష్టానికి అనుగుణంగా నడుచుకుంటూ, మంచి పనులు మాత్రమే చేస్తూ ఉంటాడు.
వీటన్నింటితో పాటు, అతను అల్లాహ్’ను ఏదైనా అడిగితే, ఆయన అతని అభ్యర్థనను అతనికి ప్రసాదిస్తాడు మరియు అతని ప్రార్థనకు సమాధానం లభిస్తుంది; మరియు అతను అల్లాహ్‌ను ఆశ్రయించి, రక్షణ కోరుతూ ఆయనను ఆశ్రయిస్తే, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ అతనికి అతను భయపడే వాటి నుండి ఆశ్రయం మరియు రక్షణను ప్రసాదిస్తాడు.
ఇంకా సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా అన్నాడు: అతనిపై నా యొక్క దయ, కరుణ కారణంగా – ఒక విశ్వాసి ప్రాణాలను తీసే విషయంలో సంకోచించినంతగా, నేను ఏ విషయములోనూ సంకోచించను. ఎందుకంటే అందులో ఉన్న కష్టం మరియు బాధ కారణంగా అతడు మృత్యువును ఇష్టపడడు, మరియు విశ్వాసిని బాధపెట్టే వాటిని అల్లాహ్ ఇష్టపడడు.

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ పష్టో అస్సామీ السويدية الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية Юрба الليتوانية الدرية الصربية الصومالية Кинёрвондӣ الرومانية المجرية التشيكية الموري Малагашӣ Урумӣ Канада الولوف الأوكرانية الجورجية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ఈ హదీథు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రభువు నుండి ఉల్లేఖించినది, అటువంటి హదీథును ‘హదీథ్ అల్ ఖుద్సీ’ అని, లేక ‘దైవికమైన హదీథు’ అని పిలుస్తారు. హదీథ్ అల్ ఖుద్సీ లోని పదాలు మరియు దాని అర్థం అల్లాహ్ నుండి. అయితే హదీసుల్ ఖుద్సీ ఖుర్’ఆన్ యొక్క ప్రత్యేకతలను, ప్రత్యేక లక్షణాలను కలిగి ఉండదు – ఉదాహరణకు: ఖుర్’ఆన్ పఠించబడినట్లు హదీసుల్ ఖుద్సీని ఒక ఆరాధనగా పఠించడం, హదీసుల్ ఖుద్సీ పఠించుటకు ‘వుజూ’ తప్పనిసరిగా చేయడం, హదీసుల్ ఖుద్సీని ఒక సవాలుగా అవిశ్వాసులకు ప్రదర్శించడం, మరియు దానిని ఒక అద్భుతంగా ప్రదర్శించడం లాంటివి ఉండవు.
  2. ఈ హదీసులో అల్లాహ్ యొక్క ‘వలీ’లకు హాని కలిగించడం నిషేధించబడినది. వారిని ప్రేమించడం, గౌరవించడం మరియు వారి ఘనతను, యోగ్యతను గుర్తించడం ప్రోత్సహించబడింది.
  3. అల్లాహ్ యొక్క శత్రువుల పట్ల శత్రుత్వం చూపమని ఆజ్ఞాపించబడింది మరియు వారిని మిత్రులుగా తీసుకోవడం నిషేధించబడింది.
  4. ఎవరైతే అల్లాహ్ యొక్క షరీయత్’ను అనుసరించకుండా, తాను అల్లాహ్ యొక్క వలీని అని దావా చేస్తాడో, అలాంటి వాడు తన దావాలో అబద్ధాలకోరు.
  5. ధార్మిక పరమైన విధులను నిర్వర్తించడం మరియు నిషేధాలకు దూరంగా ఉండటం ద్వారా అల్లాహ్ యొక్క ‘వలాయత్’ ను (అంటే అల్లాహ్ యొక్క వలీగా ఉండే భాగ్యాన్ని) పొందవచ్చును.
  6. అల్లాహ్ యొక్క ప్రేమను పొందటానికి మరియు దాసుని దుఆలకు సమాధానం పొందడానికి దారి తీసే మార్గాలలో ఒకటి అల్లాహ్ విధిగావించిన విషయాలను ఆచరిస్తూ, ఆయన నిషేధించిన వాటిని వదిలివేసి – తరువాత స్వచ్చందంగా అదనపు ఆరాధనలు ఆచరించడం.
  7. ఈ హదీసు అల్లాహ్ యొక్క వలీల గౌరవం మరియు ఉన్నత హోదాను సూచిస్తుంది.
ఇంకా