عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«اثْنَتَانِ فِي النَّاسِ هُمَا بِهِمْ كُفْرٌ: الطَّعْنُ فِي النَّسَبِ، وَالنِّيَاحَةُ عَلَى الْمَيِّتِ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 67]
المزيــد ...
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ప్రజలలో రెండు విషయాలు ‘కుఫ్ర్’ (అవిశ్వాసము) యొక్క చిహ్నాలుగా ఉన్నాయి - వంశావళిని కించపరచడం, ఎవరైనా చనిపోయినపుడు ఏడ్పులు, పెడబొబ్బలు పెట్టడం.”
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 67]
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం: అవిశ్వాసపు ఆచరణలు అనదగిన ఒక ఆచరణను గురించి, మరియు అఙ్ఞాన కాలపు సంప్రదాయాలలో ఒక దానిని గురించి (రెండు విషయాల గురించి) ఇలా తెలియజేస్తున్నారు: అవి:
మొదటిది: ప్రజల వంశావళిని కించపరుస్తున్నట్లుగా మాట్లాడడం; అవమానించడం, వారిని కించపరచడం మరియు వారి పట్ల గర్వంగా ప్రవర్తించడం.
రెండవది: ఏదైనా విపత్తు సంభవించినపుడు స్వరాన్ని పెంచి “ఖద్ర్” (విధివ్రాత) పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం, తీవ్రమైన అసంతృప్తితో బట్టలు చింపుకోవడం.