+ -

عَنْ أُبَيِّ بْنِ كَعْبٍ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:
«لاَ تَسُبُّوا الرِّيحَ، فَإِذَا رَأَيْتُمْ مَا تَكْرَهُونَ فَقُولُوا: اللَّهُمَّ إِنَّا نَسْأَلُكَ مِنْ خَيْرِ هَذِهِ الرِّيحِ وَخَيْرِ مَا فِيهَا وَخَيْرِ مَا أُمِرَتْ بِهِ، وَنَعُوذُ بِكَ مِنْ شَرِّ هَذِهِ الرِّيحِ وَشَرِّ مَا فِيهَا وَشَرِّ مَا أُمِرَتْ بِهِ».

[صحيح] - [رواه الترمذي] - [سنن الترمذي: 2252]
المزيــد ...

ఉబయ్యి బిన్ కఅబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"గాలిని దూషించకండి (తిట్టకండి). మీకు ఇష్టము లేని గాలి (ఉదాహరణకు — బలమైన తుఫాను, గాలి దుమారము వంటిది) చూస్తే, ఇలా వేడుకోండి: ‘ఓ అల్లాహ్! ఈ గాలిలో ఉన్న మంచి కోసం, అది తీసుకొచ్చే మంచి కోసం, మరియు ఈ గాలి ద్వారా ఆజ్ఞాపించబడిన మంచి కోసం మేము నిన్ను వేడు కుంటున్నాము. ఈ గాలిలో ఉన్న దుష్టత (చెడుల) నుండి, అది తీసుకొచ్చే చెడు నుండి, మరియు ఈ గాలి ద్వారా ఆజ్ఞాపించబడిన చెడు నుండి మేము నీ శరణు వేడు కుంటున్నాము.

[దృఢమైనది] - [దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారు] - [سنن الترمذي - 2252]

వివరణ

ప్రవక్త ﷺ గాలిని తిట్టకూడదనీ, శపించకూడదనీ వారించారు. ఎందుకంటే గాలి అనేది దానిని సృష్టించిన అల్లాహ్‌ తఆలా ఆజ్ఞకు లోబడిన ఒక సృష్టి. అది ప్రేమతో కూడిన (రహ్మత్) వర్షాన్ని తీసుకు రాగలదు, లేదంటే శిక్ష (అజాబ్) ను కూడా తీసుకు రాగలదు. గాలిని తిట్టడం అంటే – దాన్ని సృష్టించిన అల్లాహ్‌ ను తిట్టడమే, మరియు విధిపై (అల్లాహ్ నిర్ణయంపై) అసంతృప్తి చూపడమే అవుతుంది. దీనికి బదులుగా ప్రవక్త ﷺ మనలను ఇలా నేర్పించారు: గాలిలో ఉన్న మంచి కోసం, అది తీసుకు రాబోయే మంచి కోసం, మరియు దానికి అల్లాహ్ ఇచ్చిన ఆజ్ఞ వలన కలిగే మేలు కోసం — అల్లాహ్ ను వేడుకోవాలి, దుఆ చేయాలి. ఉదాహరణకు, వర్షాలు కురిసేలా చేయడం, పూల మధ్య పరాగసంపర్కం కలిగించడం, పొలాలకు జీవం తీసుకురావడం. అలాగే, ఆ గాలి ద్వారా కలిగే చెడు నుండి, ముప్పు నుండి, నష్టాల నుండి అల్లాహ్ వద్ద రక్షణ కోరాలి. ఉదాహరణకు, చెట్లు, పంటలు నాశనం కావడం, పశువులు మృత్యువాత పడటం, ఇల్లు, భవనాలు కూలిపోవడం మొదలైనవి. ఇలాంటి దుఆ దానిని మారుస్తుంది, మన మనసులోని అసంతృప్తిని అల్లాహ్ పై తౌహీద్ జ్ఞానం దూరం చేస్తుంది.

من فوائد الحديث

  1. గాలిని తిట్టకూడదని వారించబడింది, ఎందుకంటే అది అల్లాహ్ సృష్టించిన సృష్టి (ఖల్క్) మరియు ఆయన ఆజ్ఞకు లోబడి పనిచేస్తున్నది. అందువల్ల, గాలిని తిడితే — అది నిజానికి దానిని సృష్టించినవాడైన అల్లాహ్‌ను తిడటమే అవుతుంది. ఇది తౌహీద్ (అల్లాహ్ ఏకైకుడు అనే విశ్వాసం) లో లోపానికి సూచన.
  2. అల్లాహ్ వైపు మరలడం మరియు ఆయన సృష్టించిన చెడు నుండి ఆయన వద్ద శరణు కోరడం."
  3. గాలి (వాయువు) ఎప్పుడూ అల్లాహ్ ఆజ్ఞ మేరకే ఉంటుంది – అది మంచికి కూడా పనికొస్తుంది, చెడుకి కూడా.
  4. ఇబ్ను బాజ్ (రహిమహుల్లాహ్) అన్నారు: "గాలిని దూషించడం (అంటే తిట్టడం లేదా శాపనార్థ మాటలు పెట్టడం) అనేది పాపాలలో ఒక పాపం; ఎందుకంటే అది కూడా ఒక సృష్టి. అల్లాహ్ దానిని తను చిత్తమొచ్చిన విధంగా మంచి కోసమైనా లేదా చెడు కోసమైనా పంపిస్తాడు. కాబట్టి గాలిని దూషించడం అనుమతించబడలేదు. అంటే ఇలా చెప్పకూడదు: 'ఓ అల్లాహ్! గాలిని శపించుగాక' (లాఅన అల్లాహు ర్రీహన్), లేదా 'ఈ గాలిని అల్లాహ్ నాశనం చేయుగాక' (ఖాతల అల్లాహుర్రీహన్), లేదా 'ఈ గాలిలో అల్లాహ్ ఆశీర్వాదం లేదు' (లా బారకల్లాహు ఫీ హాథిహిర్రీహన్), లేదా వాటితో సారూప్యమైన మాటలు అనడం క్షమించబడదు. బదులుగా, ఓ ముస్లిం విశ్వాసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూచించిన విధంగా ప్రవర్తించాలి."
  5. గాలిని దూషించే పదాలను నిషేధించినట్లే, అల్లాహ్ సృష్టించిన మరియు ఆయన తన చిత్తానుసారం నడిపించే ఇతర ప్రకృతి స్థితులను — ఉదాహరణకు తీవ్రమైన వేడి (ఉష్ణత), చలి, సూర్యుడు, దుమ్ము మొదలైన వాటిని దూషించడం (శపించడం లేదా తిట్టడం) కూడా నిషిద్ధమే అని భావించబడుతుంది.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ అస్సామీ الأمهرية الهولندية الغوجاراتية Юрба الدرية الرومانية المجرية الموري Малагашӣ الأوكرانية الجورجية المقدونية الماراثية
అనువాదాలను వీక్షించండి
ఇంకా