عَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُودٍ رَضيَ اللهُ عنهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:
«لاَ تَتَّخِذُوا الضَّيْعَةَ فَتَرْغَبُوا فِي الدُّنْيَا».
[حسن لغيره] - [رواه الترمذي وأحمد] - [سنن الترمذي: 2328]
المزيــد ...
అబ్దుల్లాహ్ ఇబ్నె మస్’ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు:
“భూమి సంపాదనలో నిమగ్నులు కాకండి; తద్వారా మీరు ఇహలోక సుఖాల వైపునకు ఆకర్షించబడవచ్చు.”
[పరా ప్రామాణికమైనది] - - [سنن الترمذي - 2328]
ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పొలాలు, పండ్ల తోటలు, వ్యవసాయ భూములు వగైరాలను సంపాదించడాన్ని వారించారు. ఎందుకంటే ఇవి ఇహలోకం పట్ల కోరికకు, మరియు పరలోక జీవితం పై ఇహలోకపు ప్రాధాన్యాలు, కోరికలు పై చేయి కావడానికి కారణమవుతాయి.