+ -

عَنْ مُصْعَبِ بْنِ سَعْدٍ قَالَ: رَأَى سَعْدٌ رَضِيَ اللَّهُ عَنْهُ أَنَّ لَهُ فَضْلًا عَلَى مَنْ دُونَهُ، فَقَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«هَلْ تُنْصَرُونَ وَتُرْزَقُونَ إِلَّا بِضُعَفَائِكُمْ».

[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 2896]
المزيــد ...

ముస్’అబ్ ఇబ్న్ స’అద్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: “ఒకసారి సఅద్ (బిన్ అబీ వక్కాస్) (రదియల్లాహు అన్హు) తనకంటే తక్కువ హోదా ఉన్నవారి కంటే తాను గొప్పవాడినని భావించారు. దానిపై ప్రవక్త (ﷺ) ఇలా అన్నారు:
“మీలోని పేదలు, బలహీనుల (ఆశీర్వాదాలు మరియు దు’ఆల) ద్వారా తప్ప మీకు (అల్లాహ్ యొక్క) సహాయం మరియు జీవనోపాధి లభించిందా?”

[దృఢమైనది] - [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు - దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారు - దాన్ని నసాయీ ఉల్లేఖించారు - దాన్ని అబూ దావుద్ ఉల్లేఖించారు - దాన్ని ఆహ్మద్ ఉల్లేఖించారు] - [صحيح البخاري - 2896]

వివరణ

స’ఆద్ బిన్ అబీ వఖ్ఖాస్ (రదియల్లాహు అన్హు) తన ధైర్యము, సాహసము, శౌర్యపరాక్రమాలు మొదలైన వాటి కారణంగా తాను బలహీనులకంటే గొప్పవాడిని అనే భావనలో పడిపోయినారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: “మీలోని బలహీనులు, నిజాయితీతో కూడిన వారి ప్రార్థనలు, వేడుకోళ్ళు, దుఆలు మొదలైవ వాటి ద్వారా తప్ప నీవు విజయన్ని, జీవనోపాధిని పొందినావా?” వారు తరచుగా తమ ప్రార్థనలలో, దుఆలలో, వేడుకోళ్ళలో నిజాయితీగా ఉంటారు, ఎందుకంటే వారి హృదయాలు ఈ ప్రాపంచిక జీవితపు అలంకారాల పట్ల, ఆడంబరాల పట్ల అనుబంధాన్ని కలిగి ఉండవు.

من فوائد الحديث

  1. ఇందులో ఇతరుల పట్ల వినయం కలిగి ఉండాలని, అహంకారం నిషేధము అని హితబోధ ఉన్నది.
  2. ఇమాం ఇబ్నె హజార్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు, "బలవంతులు వారి ధైర్య, సాహసాల కారణంగా ఉన్నత స్థానంలో ఉంటే, బలహీనులు వారి ప్రార్థన మరియు నిజాయితీ కారణంగా ఉన్నత స్థానంలో ఉంటారు."
  3. పేదల పట్ల దయ చూపడం మరియు వారి హక్కులను నెరవేర్చడం పట్ల ప్రోత్సాహం ఉన్నది. ఎందుకంటే ఇది అల్లాహ్ దయ, కరుణ మరియు విజయం పొందడానికి కారణాలలో ఒకటి.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు స్వాహిలీ థాయ్ అస్సామీ الأمهرية الهولندية الغوجاراتية الدرية الرومانية المجرية الجورجية المقدونية الخميرية الماراثية
అనువాదాలను వీక్షించండి
ఇంకా